టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ద పారడైజ్’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే లీకైన ఒక చిన్న వీడియో గ్లింప్స్ ప్రేక్షకుల్లో ప్రకంపనలు సృష్టించడమే కాకుండా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానితో కలిసి ఎలాంటి అద్భుతాన్ని సృష్టిస్తున్నారో చిన్న హింట్ ఇచ్చింది. ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అయితే, మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 21, 2026న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలోని రెండో సింగిల్ (సెకండ్ సాంగ్) మే 10, 2026న విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పాట విడుదల మరియు ఇతర వివరాలకు సంబంధించి చిత్ర బృందం నుండి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మొదటి పాట ‘ఆయా షేర్’ (Aaya Sher) 100 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి భారీ విజయం అందుకోవడంతో, ఈ రెండో పాటపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
కాయదె లోహర్, మోహన్ బాబు, సోనాలి కుల్కర్ణి, బాబు మోహన్, తనికెళ్ల భరణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్ర పోషిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. పాన్-ఇండియా చిత్రంగా వస్తున్న ప్యారడైజ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.
