- Advertisement -

ఏప్రిల్ 1న 14సినిమాలు

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా వచ్చే నెల 8న రిలీజ్ కు రెడి అవుతుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అభిమానులో భారీగా అంచనాలు ఉన్నాయి.

సో ఈ సినిమా ఏప్రిల్ 8న రావడంతో చిన్న సినిమాలు అన్ని ముందే రిలీజ్ చేస్తున్నారు. సర్దార్ సినిమాతో పోటికి దిగితే తమ సినిమాలకు కష్టం అని ముందే రిలీజ్ చేస్తున్నారు. సో ఏప్రిల్ 1న ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ పద్నాలుగు చిత్రాల్లో ఎన్ని చిత్రాలకు ఎక్కువ థియేటర్లు దొరుకుతాయో చెప్పడం కష్టం ఎందుకంటే ఒకేసారి ఇన్ని చిత్రాలు రావడం వల్ల చాలా ఇబ్బందే !

ఇక ఆ పద్నాలుగు చిత్రాలు ఏవో ఒకసారి చూద్దామా. ఎటాక్, 7to 4, రహదారి, సావిత్రి, భరతన్న, ఓ మల్లి, రాజాది రాజా, పిడుగు, ఆమె ఎవరు, అప్పుడలా ఇప్పుడిలా,  24 hours, నన్నువదిలి నీవు పోలేవులే, మాస్. ఈ 14సినిమాల్లో ఏ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి మరి. అయితే ఈ చిత్రాల్లో ముఖ్యంగా మంచు మనోజ్ ఎటాక్, నారా రోహిత్ సావిత్రి, శర్వనంద్ రాజాది రాజా సినిమాలపై  మంచి అంచనాలే ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -