- Advertisement -

నో కండోమ్.. వోన్లీ ఇంజెక్షన్..

- Advertisement -

పురుష పుంగవులకు ఓ బాధ తీరనుంది. మాటి మాటికి కండోమ్ వాడాల్సిన అవసరం లేకుండా ఒక్క ఇంజెక్షన్ కనిపెట్టారు అమెరికన్లు. కండోమ్ లు వాడినా 18 శాతం మంది మహిళలు గర్భం దాలుస్తున్నారనడానికి శాస్త్రీయ ఆధారాలు చూపుతున్నారు. దీంతో మహిళలు కచ్చితంగా గర్భం దాల్చకుండా ఉండాలంటే ఇంజెక్షన్ చేయించుకుంటే చాలంటున్నారు.

శాస్త్రవేత్తలు కనుగొన్న వాసాజెల్ ఇంజెక్షన్ వాడడం వల్ల గర్భధారణ జరగనే జరగదని కండోమ్ గుద్ది మరీ చెబుతున్నారు. ఇంజెక్షన్ ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు మగ కుందేళ్లకు ఈ ఇంజెక్షన్ చేశారట. ఏడాది దాటినా వాటి జంట గర్భం దాల్చలేదట. ఈ ఇంజెక్షన్ కు హైడ్రోజెల్ లక్షణాల ఉన్నాయని, దాని కారణంగా సుదీర్ఘ కాలం పాటు గర్భం దాల్చడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రయోగాన్ని 12 కుందేళ్లపై చేస్తే  11 కుందేళ్లకు వీర్యకణాలు లేవని, ఒక్కటంటే ఒక్క కుందేలుకే వీర్యకణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరికొన్నాళ్లకు మగవారిపై ఈ పరీక్షలు జరిపి అప్పుడు మార్కెట్ లోకి విడుదల చేయాలనుకుంటున్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -