Monday, May 20, 2024
- Advertisement -

2024..సంక్రాంతి సినిమాల సందడి!

- Advertisement -

సంక్రాంతి రేసులో సినిమాలంటే ఉండే మజానే వేరు. ఓ వైపు కోడి పందాలు మరోవైపు సినిమాలు. అందుకే సంక్రాంతి రేసులో హిట్ కొట్టేందుకు పెద్ద హీరోల దగ్గరి నుండి చిన్న సినిమాల హీరోల వరకు హిట్ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక ప్రతి ఏడాదిలాగే ఈ సారి సంక్రాంతి సినిమా పోటీ ఆసక్తికరంగా సాగనుంది.

ఈ సారి రేసులో సూపర్ స్టార్ మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జునతో ఆపటు తేజ సజ్జ ఉండగా ఓ తమిళ డబ్బింగ్ చిత్రం కూడా పోటీకి సిద్ధమైంది. ముందుగా సంక్రాంతి బరిలో దిగనున్న చిత్రం గుంటూరు కారం. జనవరి 12న సినిమా రిలీజ్ కానుండగా మహేష్ సరసన శ్రీలీలతో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అదేరోజు విడుదల కానుంది హను మాన్. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో తేజ సజ్జ హీరోయిన్‌గా నటించగా అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక జనవరి 13న వెంకటేష్ నటించిన సైంధవ్ రిలీజ్ కానుంది. వెంకీ కెరీర్‌లో ఇది 75వ సినిమా కాగా శైలేష్ కొలను దర్శకత్వం హించారు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో సెంటిమెంట్‌తో పాటు వయొలెన్స్, యాక్షన్ కూడా ఉండనుందని అర్థమవుతోంది. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది నాగార్జున నటించిన నా సామిరంగ. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రాజ్ తరుణ్, అషికా రంగనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే శివకార్తీకేయన్ నటించిన అయాలన్ సైతం ఈ సంక్రాంతి బరిలోనే నిలవనుంది. ఇప్పటికే థియేటర్ల సమస్య నెలకొనగా శివకార్తికేయన్ సినిమాకు ఎన్ని థియేటర్లు దొరుకుతాయో వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -