Sunday, April 28, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు..దొంగ ఓట్లకు చెక్!

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని తద్వారా దొంగ ఓట్లకు చెక్ పడుతుందని కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కోరారు ఎంపీ విజయ సాయిరెడ్డి. మార్గాని భరత్‌తో కలిసి కేంద్ర ఎన్నికల సంఘాన్ఇన కలిసి ఆరు అరు అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయసాయి రెడ్డి..రెండు రాష్ట్రాలకు ఒకే తేదీన‌ ఎన్నికలు పెడితే డూప్లికెట్‌ ఓటర్లు ఓటు వేయానికి అవకాశం ఉండదని తెలిపారు.

జనసేనకు ఉన్న గ్లాస్‌ గుర్తు జనరల్‌గా సింబల్‌గా గుర్తించడం చట్టవిరుద్ధమని సీఈసీకి ఫిర్యాదు చేశామన్నారు. చంద్రబాబు, లోకేష్‌తో పాటూ‌ మిగతా టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్‌పై అసభ్యపదజాలం వాడుతున్నారని ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు నారా లోకేష్‌ ప్రతి చోట ఎర్ర బుక్ చూపిస్తూ బెదిరిస్తున్నారని.. ఈ ఎర్ర బుక్ విషయంలో లోకేష్, చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండాలని.. డూప్లికెట్‌ ఓట్లు ఉన్నాయని, తెలంగాణలో ఓట్లు తొలగించిన తరువాతే ఏపీలో నమోదు చేసుకోవాలని కోరామన్నారు.టీడీపీ చట్టువిరుద్దమైన చర్యలకు పాల్పడుతుందని.. మై పార్టీ వెబ్‌ సైట్‌ను విదేశాల నుంచి ఆపరేట్‌ చేస్తున్న విషయంపైనా ఫిర్యాదు చేశామన్నారు. 2024లో అధికారంలోకి వస్తున్నామని.. ఐదేళ్లలో ఇన్ని లక్షలు లబ్ధి ఉంటుందని ఆన్‌లైన్‌లో బాండ్‌ ఇస్తున్నారని..ఇలాంటి ఫిర్యాదు దారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని వెల్లడించారు విజయ్ సాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -