Monday, May 6, 2024
- Advertisement -

మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధం!

- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కొత్తేమీ కాదు. కానీ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞ ఇదిగో వస్తున్నారని అదిగోవస్తున్నారని ప్రచారం జరిగిన ఇంతవరకు క్లారిటీ మాత్రం రాలేదు. అయితే తాజాగా మరోసారి నందమూరి వారసుడి ఎంట్రీపై టాలీవుడ్ కోడై కూస్తోంది.

బాలయ్య లైనప్ చేసిన సినిమాల్లో ఒకటి అఖండ 2. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు బక్లాక్ బాస్టర్ హిట్ కాగా అఖండ సూపర్బ్ అనిపించుకుంది. ఇప్పుడు వస్తున్న అఖండ 2పై భారీ అంచనాలు నెలకెఒనగా ఈ సినిమాతోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనుండని తెలుస్తోంది.

బోయపాటి డైరెక్షన్ లో లాంచ్‌ అయితే హిట్ కొట్టడం ఖాయమని బాలయ్య సైతం భావిస్తున్నారట. ఇక బోయపాటి సైతం కథను చాలా సాలీడ్‌గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటుండగా మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ ‘ఆదిత్య 369’ సీక్వెల్‌తో ఉంటుందని భావించినా బోయపాటిపైనే ఆశలు పెట్టుకున్నారట బాలయ్య. దీనిపై త్వరలోనే అఫిషియల్ ప్రకటన రానుండగా అఖండ 2తో ఈ క్రేజీ కాంబో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -