Saturday, May 3, 2025
- Advertisement -

తెలుగులోకి ఆవేశం..హీరో ఎవరో తెలుసా?

- Advertisement -

పుష్ప సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఫహాద్ ఫాజిల్. పోలీస్ ఆఫీసర్‌గా ప్రత్యేకమైన శైలీతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రెస్పెక్ట్ తగ్గిందనే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక పుష్ప సినిమాతోనే కాదు అంతకముందు మాలీవుడ్‌లోనూ సత్తాచాటారు ఫహాద్.

పుష్ప తర్వాత మలయాళంలో ఆవేశం అనే సినిమా చేయగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్‌ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. మలయాళంలో జిత్తు మాధవన్ దర్శకత్వం వహించగా మన్సూర్ అలీఖాన్, అసిస్ విద్యార్థి, సజిన్ గోబు, పూజా మోహన్‌రాజ్ తదితరులు కీలకపాత్ర పోషించారు. హీరోయిన్ లేకుండా తెరకెక్కింది ఈ చిత్రం.

ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనుండగా అఖండ బాలకృష్ణ హీరోగా నటించనున్నారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. సినిమా కథను తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చనున్నారని తెలుస్తోండగా ఒకవేళ బాలయ్య ఓకే చెబితే హీరోయిన్ లేకుండా బాలయ్య నటించే తొలి చిత్రమిది అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -