బోయపాటి తర్వాత సినిమా అల్లు అర్జున్‌తో కాదా ?

- Advertisement -

అఖండ సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న దర్శకుడు బోయపాటి శ్రీను మంచి ఊపుమీదు ఉన్నారు. మరి వాట్ నెక్ట్స్‌ అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. బోయపాటి శ్రీను తర్వాత ఎవరితో సినిమా తీయబోతున్నారన్న ఆసక్తి టాలీవుడ్ ప్రేక్షకుల్లోనూ నెలకొంది. అఖండ తర్వాత అల్లు అర్జున్‌తో ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించనున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇంతకు ముందు వీరు కాంబినేషన్‌లో వచ్చిన సరైనోడు.. సూపర్ హిట్ కొట్టింది. దాంతో సరైనోడు కంటే రెండింతలు హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే బోయపాటి నెక్స్ట్ మూవీ బన్నీతో కాదట. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనితో అని సమాచారం. ఇప్పటివరకు వీరి కాంబినేషన్‌లో సినిమా రాలేదు.

పుష్ప పార్ట్ 2 త్వరలోనే మొదలవబోతోంది. పుష్ప సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్ కావడంతో పుష్ప పార్ట్ 2 నిర్మాణంపై ఆ సినిమా దర్శక నిర్మాతలు దృష్టిపెట్టారు. ఈ మూవీతో బన్నీ బిజీ కావడంతో.. బోయపాటికి కాస్త గ్యాప్ రానుంది. ఆ గ్యాప్‌లోనే రామ్ హీరోగా ఓ సినిమాను పూర్తి చేయాలని దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే బోయపాటి శ్రీను, పోతినేని రామ్ సినిమాపై ఇంకా అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

Alao Read

శ్రీదేవి కుమార్తె తెలుగులో అరంగేట్రానికి రంగం సిద్ధం

మ‌రో సీక్వెల్ కు సిద్ధ‌మ‌వుతున్న డార్లింగ్

రష్మి గౌతమ్ పెళ్లి చేసుకుందా..?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -