Friday, March 29, 2024
- Advertisement -

ప్రముఖ దర్శకుడితో గొడవపై క్లారిటీ ఇచ్చిన శ్రీకాంత్

- Advertisement -

టాలీవుడ్ లో హీరో శ్రీకాంత్ కు వివాద రహితుడిగా పేరుంది. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాల్లో నటించి తన కంటూ గుర్తింపును తెచ్చుకున్నారు. ఇటీవల విడుదలైన బాలయ్య సినిమా అఖంఢలో విలన్ గా బలమైన పాత్రలో నటించి ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారారు. ఈ సినిమాలో శ్రీకాంత్ బాలయ్యతో పోటీపడి నటించాడు. దీంతో టాలీవుడ్ లో మరోసారి శ్రీకాంత్ పేరు మారుమోగుతోంది.

ఇటీవల ఒక ప్రముక కమెడియన్తో జరిగిన ఒక ప్రోగ్రాంలో శ్రీకాంత్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక ప్రముఖ దర్శకుడితో మీకు గొడవ జరిగిన విషయం వాస్తవమా అంటూ అడిగిన ప్రశ్నకు శ్రీకాంత్ సమాధానం ఇచ్చారు. ఒకరోజు సినిమా సెట్లో ఎంతో రిహార్సల్సు చేసి చెప్పిన విధంగా డాన్స్ చేసినా కూడా దర్శకుడు సాటిసిఫై కాలేదని చెప్పారు. ఎన్నో సార్లు మార్చి రోజంతా డాన్స్ చేయించారని తెలిపారు.

రోజంతా చేస్తున్నా అతను రీటేక్ లు చెబుతుండడంతో చాలా ఆవేశానికి గురయ్యానని తెలిపారు. దీంతో చాలా కోపం వచ్చిందని, సెట్లో ఉన్న వస్తువులన్నీ విసిరికొట్టి అక్కడి నుంచి చాలా ఆవేశంగా వెళ్లిపోయానని అన్నారు శ్రీకాంత్. తాను సినిమా ఇండస్ట్రీలో పడిన మొదటి, చివరి గొడవ అదే అని అన్నారు. అప్పటి నుంచి నేటి వరకు ఎవరితోనూ ఎటువంటి గొడవలు జరగలేదని పేర్కొన్నారు.

నో కామెంట్… కెరీర్ పైనే ఫోకస్

ప్రకాశ్ రాజ్ టీం రాజీనామాలకు ఆమోదం

అప్పటి వరకు మహేష్‌తో సినిమా చేయను

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -