Wednesday, April 24, 2024
- Advertisement -

తప్పు నాది.. మా కుటుంబాన్ని ఎందుకు లాగింది? శ్రీరెడ్డిపై అభిరామ్ ఫైర్!

- Advertisement -

దగ్గుబాటి రామానాయుడు మనువడు,రానా త‌మ్ముడు ద‌గ్గుబాటి అభిరామ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టడానికి సరైన సమయం కోసం చాలాకాలం నుంచి ఎదురు చూస్తున్నాడు. తాజా స‌మాచారం ప్ర‌కారం విలక్షణ దర్శకుడు తేజ దర్శకత్వంలో అభిరామ్ హీరోగా పరిచయం కానున్నట్లు తెలుస్తోంది. గతంలో హిరో రానాకు “నేనే రాజు నేనే మంత్రి” వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ద‌ర్శ‌కుడు తేజానే అభిరామ్ తొలి సినిమాకు ఎంపిక చేసిన‌ట్లు సమాచారం.

ఇదిలా ఉండగా నిన్న దగ్గుబాటి అభిరామ్‌ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అభిరామ్ తన నిజ జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల గురించి చెప్పుకొచ్చాడు. తాను తెలియక తప్పు చేశానని,పశ్చాత్తాపడుతూ, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని కాకుండా ఫ్యామిలీ మొత్తాన్ని బయటకు లాగడం కరెక్ట్ కాదని పేర్కొన్నాడు.నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ బట్టి యువతకు నేను చెప్పేది ఏంటంటే దూకుడు వద్దు.మన వల్ల వేరే ఫ్యామిలీకి ఎఫెక్ట్ కాకూడదనీ సూచించాడు.

Also read:నాపై హైపర్ అది కన్నేశాడంటూ ఎమోషనలైన యాంకర్ అనసూయ.. వైరల్!

నేను నార్మల్ హీరోగా మాత్రమే ఉండాలనుకుంటున్నా రామానాయుడు మనవడ్ని, సురేష్ బాబు కొడుకుని అనే ఇమేజ్ వద్దు నాకు.నా లైఫ్‌లో జరిగిన బ్లాక్ మెయిల్ అనేది అందరి లైఫ్‌లోనూ ఉంటుంది. కొంతమంది బయటపడతారు. మరికొంతమంది బయటపడరు. మనం జాగ్రత్తగా ఉండాలటూ చెప్పుకొచ్చాడు.అయితే అభిరామ్ ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు శ్రీరెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రశ్నలు వేస్తున్నారు. మన లేడీస్ శ్రీరెడ్డి ఎలా ఉంది? అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Also read:‘టాలీవుడ్’లో ఎవర్ గ్రీన్ ప్రేమ కథ చిత్రాలు ఇవే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -