Thursday, March 28, 2024
- Advertisement -

విజయ్ రెమ్యూనరేషన్ వింటే షాక్?

- Advertisement -

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఇమేజ్ సంపాదించాడు విజయ్. గత కొంత కాలంగా విజయ్ నటించిన చిత్రాలు మొదట కాంట్రవర్సీకి గురైనా రిలీజ్ అయిన తర్వాత సూపర్ హిట్ అవుతున్నాయి. ఈ ఏడాది విజయ్ నటించిన ‘మాస్టర్’ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడం మాత్రమే కాదు కరోనా సమయంలో భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇక విజయ్ ఒక సినిమా పూర్తవుతూ ఉందనగానే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లేలా ఆయన ప్లాన్ చేసుకుంటాడు. అంతే కాదు ఆయనకు కథలను వినిపించే దర్శక నిర్మాతలు లైన్లో ఉంటారు.

విజయ్ ప్రస్తుతం తన 65వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ మూవీ తర్వాత విజయ్ డైరెక్ట్ గా తెలుగు లో ఫస్ట్ టైమ్ నటించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాను వంశీ పైడిపల్లితో విజయ్ చేయనున్నాడనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమా విడుదల కానున్నట్టుగా చెప్పుకున్నారు. ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించనున్నాడని అన్నారు.

ఇది ఎంత వరకు నిజమో అబద్దమో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మరో వార్త హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాను దాదాపు 175 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారనీ .. పారితోషికంగా విజయ్ కి 50 కోట్లకి పైనే ముట్టనుందని అంటున్నారు. ఈ వార్త ఎంత వరకు నిజమో అఫిషియల్ గా తెలిస్తే కానీ నమ్మలేం అని మరికొందరు అంటున్నారు.

పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసిన కన్నుగీటు పాప..!

ఏపీ అంబులెన్స్‌లకు తెలంగాణలో నో ఎంట్రీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -