Saturday, May 4, 2024
- Advertisement -

నితీశ్ రాజీనామా..మళ్లీ సీఎంగా!

- Advertisement -

అంతా అనుకున్నట్లే జరిగింది. బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ రాజీనామా చేశారు. తన రాజీనామీ లేఖను గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు అందించారు. అయితే తన రాజీనామాకు గల కారణాలమ ఉమాత్రం లేఖలో పేర్కొనలేదు నితీశ్‌. ఇక నితీశ్ రాజీనామాను వెంటనే అమోదించిన గవర్నర్ తాత్కాలిక సీఎంగా ఉండాలని కోరారు.

వారం రోజులుగా నితీశ్ రాజీనామాపై వార్తలు వస్తున్నాయి. ఇవాళ, రేపు అంటూ పెద్ద ఎత్తున మీడియాలో కథనాలు రాగా తొలుత అలాంటిదేమీ లేదని చెప్పిన నితీశ్ ఇవాళ ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా సమర్పించారు. దీంతో బిహార్ సంకీర్ణ సర్కార్‌కు తెరపడింది.

2021 ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు నితీశ్ కుమార్. అయితే ఇది జరిగిన ఏడాది తర్వాత తన సీఎం సీటుకు బీజేపీ ఎసరు పెడతుందని భావించి ఆ పార్టీకి కటీఫ్ చెప్పి ఆర్జేడీతో చేతులు కలిపారు. ఆర్జేడీ,కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 2021లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత‌ ఇప్ప‌టి వ‌ర‌కు మూడు సార్లు నితీశ్ త‌న ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయగా రెండు సార్లు తన ప్రభుత్వాన్ని తానే కూల్చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -