Wednesday, May 1, 2024
- Advertisement -

మెగా హీరోపై లవ్ కామెంట్స్….. ఆ హీరోయిన్‌పై కక్ష్య కట్టిన మెగా టీం

- Advertisement -

11మంది హీరోలున్న మెగా టీంలో ఆయన కూడా ఒకరు. ఆయన చిన మామయ్యలాగే ఆయన కూడా మంచి పేరు ‘తెచ్చుకున్నారు’. అందరి చేతా మంచోడు మంచోడు అని గొప్పగా చెప్పించుకున్నాడు. కానీ ఒక హీరోయిన్‌తో నడిపిన ప్రేమాయణం మాత్రం ఆయన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసింది. మనోడిలో ఆయన మామయ్య కలలు కూడా గట్టిగానే ఉన్నాయే అన్న టాక్ వినిపించింది. కాస్త స్టార్ ఢం వస్తే మనవాడు కూడా ఫాం హౌస్ వ్యవహారాలు షురూ చేస్తాడా ఏంటి? అన్న టాక్ వినిపించింది.

ఆ విషయాలు ఎలా ఉన్నా అసలే వరుస ఫ్లాప్స్‌తో ఇబ్బందిపడుతున్న మనవాడిని ప్రేమ వ్యవహారం బాగా ఇబ్బందిపెట్టింది. ఆ హీరోయిన్ కూడా చాలా మందిలా సైలెంట్‌గా ఉండకుండా ఆ మెగా హీరోని టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేసేసింది. ఇక ఆ తర్వాత నుంచీ మెగా కాంపౌండ్ మొత్తం ఆ హీరోయిన్‌ని టార్గెట్ చేశారని తెలుస్తోంది. రీసెంట్‌గా ఒక మీడియం రేంజ్ హీరో పక్కన ఆ అమ్మాయి హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది. అయితే హీరోయిన్స్ డేట్స్ కూడా చూస్తూ ఉండే మెగా కింగ్ పిన్ పర్సనాలిటీ సీన్‌లో ఎంటర్ అయి ఆ హీరోయిన్‌ని తీసేయమని ఆ సినిమా ప్రొడ్యూసర్స్‌కి చెప్పాడు. మెగా కాంపౌండ్ వ్యక్తులు డేట్స్ చూస్తున్న మరో హీరోయిన్ ఆ సినిమాలో బుక్ అయ్యేలా చేశాడు. పాపం ఆ హీరోయిన్……… మెగా హీరోగారు ప్రేమ కబుర్లు చెప్పిన ఫలితం…… మెగా హీరోతో ప్రేమాయణం పుణ్యమాని ఇకపై సినిమాలే లేకుండా కెరీరే క్లోజ్ అయ్యేంత ప్రమాదంలో పడిందని ఇండస్ట్రీ జనాలు సానుభూతి చూపిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది జనాలు అంతే…….. తెరపైన మాత్రం బ్రహ్మాండమైన హీరోలు…… అందుకే అభిమానులు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఒక సారి ఆయా హీరోల తెరవెనుక విలనిజం, ఇడియాటిక్ బిహేవియర్ చూస్తే మాత్రం మళ్ళీ జన్మలో సినిమా హీరోలను అభిమానించడం మానేయడం ఖాయం. ఆ విషయం మన సినిమా హీరోలకు కూడా తెలుసు కాబట్టే……..మీడియా ముందు, కెమేరాల ముందు మాత్రం మంచితనం ముసుగేసుకుని బ్రహ్మాండంగా నటిస్తూ ఉంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -