Monday, May 6, 2024
- Advertisement -

బాబుకు ఆగ‌ష్ట్ గండం తప్ప‌దా..?

- Advertisement -

తెలుగుదేశంపార్టీని ఆగష్టు సంక్షోభం వెంటాడుతోందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఎన్‌డీఏ నుంచి టీడీపీ బ‌య‌ట‌కు రావ‌డంతో రాష్ట్రంలో రాజ‌కీయాలు మారిపోతున్నాయి. బాబు కేంద్రం ఆడుతున్న ఆట‌లో పావుగా మారిపోతున్న‌ట్లు ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ఎప్పుడైతే ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేసిందో అప్పటి నుండి చంద్రబాబు లక్ష్యంగా బిజెపి కూడా పావులు కదుపుతోంది. ప‌ట్టిసీమ‌, పోల‌వ‌రంలో అవినీతి జ‌రింద‌ని భాజాపా నేత‌లు ఆరోపిస్తున్నారు. దీనికి తోడు జనసేన ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు, లోకేష్ లక్ష్యంగా పవన్ కల్యాణ్ చేసిన అవినీతి ఆరోపణలు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేసిందో అప్పటి నుండి చంద్రబాబు లక్ష్యంగా బిజెపి కూడా పావులు కదుపుతోంది. ఒకేసారి కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలో వైసిపి, జనసేనలు దాడులు మొదలుపెట్టాయో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఆ టెన్షన్ తోనే గంటకో మాట మాట్లాడుతున్నారు.

రాష్ట్రంలో అసెంబ్లీసీట్లు పెరిగే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో టీడీపీలోని నేత‌లు కొంద‌రు వైసీపీ వైపు, మ‌రి కొంద‌రు జ‌న‌సేవైపు చూస్తున్నారు. జ‌న‌సేల ఆవిర్భావ ఆవిర్భావ దినోత్సవంలో చంద్రబాబు, లోకేష్ అవినీతిపై 40 మంది ఎంఎల్ఏలు తనకు ఫిర్యాదు చేశారని పవన్ చెప్పటంతో టిడిపిలో కలకలం మొదలైంది.

చంద్రబాబు అనుమానిస్తున్నట్లుగానే ఒకవేళ కేంద్రం గనుక సిబిఐ దాడులు చేయిస్తే అక్కడితో టిడిపి కథ ముగిసినట్లే అనే ప్రచారం ఊపందుకోవటం గమనార్హం. అదే గనుక నిజమైతే చంద్రబాబుకు సమస్యలు మొదలైనట్లే. అదే సమయంలో చంద్రబాబును బోనెక్కించనిదే తగ్గేది లేదంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బహిరంగంగా సవాలు విసిరిన సంగతి అందరికీ తెలిసిందే. ప‌రిణామాలు చూస్తుంటే టీడీపీకి ఆగ‌ష్ట్ సంక్షోభం త‌ప్ప‌ద‌నే భావ‌న వినిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -