Saturday, May 4, 2024
- Advertisement -

రాజగురువు మాస్టర్ ప్లాన్…. జెపి అసలు రంగు తెలిసిపోగానే ఆయనను రంగంలోకి దించాడా?

- Advertisement -

తెలుగు రాష్ట్రాల రాజకీయాలను శాసిస్తున్న మీడియా అధినేత. మీడియా అంటే మళ్ళీ మధ్యస్థంగా ఉంటాడు అనుకునేరు. తాను ఏ పార్టీకి వ్యతిరేకమో……ఏ పార్టీకి వ్యతిరేకం కాదో సాక్షాత్తూ న్యాయస్థానానికే చెప్పి మీడియా ప్రపంచం ఆశ్ఛర్యపోయేలా చేసిన ఘనుడు. ఒక పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తూ ఉంటానని ఆయనే చెప్పుకున్నాడు కాబట్టి ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. కానీ చంద్రబాబు కోసం ఆయన పన్నే వ్యూహాలు…… రంగంలోకి దించే మనుషుల వ్యవహారాలు మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి.

లోక్ సత్తా అంటూ జయప్రకాష్ నారాయణను రంగంలోకి దించింది ఈయనే. వైఎస్‌లపై బురద జల్లడానికి మాత్రం జెపి భలే పనికొచ్చాడు. చంద్రబాబు అవినీతి గురించి మాత్రం అస్సలు మాట్లాడడు. రాజగురువు వ్యాపారాల్లో ఉన్న అక్రమాలను ప్రశ్నిస్తే దానిని మీడియాపై దాడిగా అభివర్ణించిన ఘనత జెపిది. ఆరోగ్యశ్రీ గురించి కూడా విమర్శలు చేసిన జెపికి చంద్రబాబు దొంగ హామీలు, ప్రజలను మోసం చేసిన వైనంపై మాత్రం అస్సలు ప్రశ్నించడు. తాజాగా పవన్‌తో కలిసి జేఎఫ్‌సీ అంటూ హంగామా చేసినప్పుడు కూడా చంద్రబాబును ప్రశ్నించే అర్హత కేంద్రానికి లేదు అని తేల్చేశాడు జెపి. అదీ బాబు కోసం పనిచేసే జెపీ రాజకీయం. అయితే ఇప్పుడు జేపీకి పూర్తిగా క్రేజ్ పోయింది. ఎవ్వరూ నమ్మే పరిస్థితిలేదు.

అందుకే ఇప్పుడు నిజాయితీ ముసుగేసుకున్న మరో అధికారిని రంగంలోకి దింపుతున్నారు రాజగురువు. జగన్ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో కూడా పూర్తిగా టిడిపికి ఉపయోగపడేలా వ్యూహారచన చేసిన సదరు అధికారిని నిజాయితీపరుడుగా ఆల్రెడీ ప్రొజెక్ట్ చేశారు. తోక పత్రిక అధినేతతో గంటలు గంటలు ఫోన్లలో మాట్లాడడాలు, ఇంకా ఆయన ఇతర వ్యవహారాలపై ఎన్నో విమర్శలు వచ్చాయి. చంద్రబాబుపై సిబిఐ కేసు నమోదు చేయమంటే సిబ్బంది లేరు అని తప్పించుకున్న ఆయన పచ్చ బ్యాచ్ జనాలందరికీ కూడా సత్య హరిశ్ఛంద్రుడి స్థాయి నిజాయితీపరుడిగా కనిపిస్తాడనడంలో సందేహం లేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయం అని సర్వేలు తేల్చి చెబుతున్న నేపథ్యంలో చివరి ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు ఈ అధికారిని రంగంలోకి దింపి జగన్‌ని ఇరిటేట్ చేయాలనుకుంటున్నారు…… జగన్ విశ్వసనీయతను దెబ్బతీయాలనుకుంటున్నారు. ఈ ఎన్నికల ఏడాదిలో ఆ ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తారనడంలో సందేహం లేదు. కాకపోతే నాలుగేళ్ళుగా అబద్ధపు హామీలు, మోసపూరిత చర్యలతో బాబు పాలన అంటే విరక్తిగా ఉన్న ప్రజలు…..ఈ సారి కూడా ఇలాంటి పచ్చ బ్యాచ్ ముద్రతో వచ్చే నిజాయితీపరుల(?)ను నమ్ముతారా? ఇలాంటి వ్యూహాలకు తలొగ్గి, అబద్ధపు ప్రచారాలను నమ్మి మరోసారి బాబుకు అధికారం అప్పగిస్తారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -