Sunday, June 16, 2024
- Advertisement -

పెళ్లికి ముందు ఆ ఇద్దరు రమ్మన్నారు : రాధికా ఆప్టే

- Advertisement -

ఏ హీరోయిన్ అయిన సరే పెళ్లి కానంత వరకు ఎలాంటి సీన్స్ లో అయిన చేయడానికి రెడీగా ఉంటారు. పెళ్ళాయ్యాక కొన్ని సన్నివేశాలకు నో చెప్తారు. కానీ రాధికా ఆఫ్టే అలా కాదు. పెళ్లయ్యాకే ఆమె సినిమాల్లోకి వచ్చినప్పటికీ ఏ హీరోయిన్ ధైర్యం చేయలేని సీన్లలో నటించారు. కెమెరా ముందు నగ్నంగా నటించిన సినిమాలు కూడా ఉన్నాయి.

కానీ ఈ విషయంలో తనకు తన భర్త బెనెడిక్ట్ టేలర్‌కు మధ్య ఎప్పుడూ గొడవలు రాలేదని అంటున్నారు. అయితే పెళ్లికి ముందు ఇద్దరు వ్యక్తుల వల్ల తనకు ఎదురైన అనుభవాన్ని ఓ సందర్భంలో రాధిక వెల్లడించింది. “నా కంటే చిన్న వయసు వాళ్ళతో నేను ఎప్పుడూ డేటింగ్ చేయలేదు. కానీ నాకు ఇప్పటికి గుర్తు. పెళ్లికి ముందు ఒకే రోజు ఇద్దరు అబ్బాయిలు నన్ను డేటింగ్ కు రమ్మన్నారు. వారిలో నా భర్త బెనెడిక్ట్ ఒకరు. అయితే నాకు ఏం చేయాలో తెలియదు. దాంతో నేను, నా ఫ్రెండ్ ఒక నిర్ణయానికి వచ్చాం. నేను టూనా చేపను వండి మా ఇంటికి వచ్చే పిల్లికి పెట్టా.

ఒకవేళా ఆ పిల్లి నేను వంటిన టూనా చేపను తింటే బెనెడిక్ట్‌తో డేటింగ్‌కి వెళ్లాలని తినకపోతే మరో కుర్రాడితో డేటింగ్‌కి వెళ్లాలని నిర్ణయించుకున్నా. ఆ పిల్లి చేపను తినింది. దాంతో నేను బెనెడిక్ట్‌తోనే డేటింగ్‌కు వెళ్లాను. ఇప్పుడు నేను ఆయన్నే పెళ్లి చేసుకున్నాను’’ అని వెల్లడించారు. బెనెడిక్ట్ లండన్‌కు చెందిన ప్రముఖ మ్యుజిషియన్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -