Monday, May 6, 2024
- Advertisement -

షాక్ ఇచ్చిన సమంత.. ఎందుకంటే?

- Advertisement -

చాలకాల౦ సిద్ధార్థ్ తో ప్రేమలో మునిగి తేలిన సమ౦తకు ఇప్పుడు ప్రేమ అనే పదమే నచ్చడ౦ లేదట. అంతేకాదు ఒక వ్యక్తిని ప్రేమిస్తూ కాలం గడపడం తెలివి తక్కువ పని అని సెటైర్లు వేసింది. దీనితో ఈ సెటైర్లు అన్నీ సిద్ధార్థ్ ను టార్గెట్ చేస్తూ సమంత వేసిందని అనుకున్నారు. తమిళంలో  ‘తంగమాన్’ అనే సినిమాలో ధనుష్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమా విజయం సాధించడంతో సక్సెస్ మీట్‍లో ప్రేమ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది సమంత. ప్రేమ౦టేనే ఇప్పుడు నమ్మక౦ పోయి౦ది. అందుకే ప్రేమ విషయమై ఆలోచించడం మానేశాను అంటు కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నా దృష్టి అంతా సినిమాలపైనే ఉంది అని తెలిపింది. ఈ షాకింగ్ కామెంట్స్ సిద్ధార్ధ్ ను టార్గెట్ చేస్తూ సమంత వేసిందని కోలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది.

సమంత ప్రేమ విషయంపై చేసిన కామెంట్స్ పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. మరో వైపు సిద్ధార్ధ్ ప్రస్తుతం త్రిషతో డేటింగ్ చేస్తున్నాడు అనే పుకార్లు చక్కర్లు కొడుతుంది..మరి ఈ పుకారు సమంత వరకు వెళ్ళిందో ఏమో. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -