Friday, April 26, 2024
- Advertisement -

సుశాంత్ తో మహేష్ హీరోయిన్ రోమాన్స్ !

- Advertisement -

సుశాంత్ అంటే అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ కాదండోయ్.. బాలీవుడ్ యంగ్ హీరోల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న టీవీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్. ఈ హీరో ముందు టీవీ సీరియల్ ద్వారా పాపులర్ అయ్యి బాలీవుడ్ కి హీరోగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు ఇండియన్ క్రికెట్ టీం క్యాప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ధోని సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

కాగా ఈ సినిమాతో పాటు ఈ యంగ్ హీరో మరో రొమాంటిక్ సినిమాలోనూ నటిస్తున్నాడు. అందులో హీరోయిన్ గా మహేష్ 1 నేనొక్కడినేతో ఆకట్టుకున్న కృతి సనన్ నటిస్తుంది. ఈ మధ్యనే ట్రైల్ షూట్ కి సంబంధించిన హాట్ ఫోజులు ఆన్ లైన్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల కాబోతుంది.

కాగా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలే కాలేదు అంతలోనే లీడ్ పెయిర్ ఇద్దరి మధ్య మంచి సన్నిహితం పెరిగిందని టాక్. ప్రస్తుతం బీటౌన్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇద్దరు డేటింగ్ లో ఉన్నారట. కెరీర్ ఎలాగు రయ్ రయ్ అంటూ మంచి స్పీడ్ మీదే ఉండటంతో ఇటు ప్రేమని కూడా అలాగే స్పీడ్ గా మెయిన్ టైన్ చేస్తున్నారని అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -