Monday, May 6, 2024
- Advertisement -

నేను ఇలా ఉండటానికి కారణం నాగార్జునే : నటి సుధ

- Advertisement -

తెలుగు సినీ పరిశ్రమలో.. అమ్మ, వదిన, అత్తయ్య, అక్క లాంటి పాత్రల్లో ఎంతో అద్భుతంగా నటిస్తూ.. ఎలాంటి కాంట్రవర్సీలు లేకుండా కెరీర్ ను కొనసాగిస్తున్న నటి సుధ. సినీ పరిశ్రమలో ఇప్పటి వరకు అందరూ టాప్ హీరోల సినిమాలో నటించిన సుధ ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలుపుతున్నాడు.

తెలుగు సినీ పరిశ్రమ తనను ఎంతగానో ఆదరించిందని.. తెలుగు ప్రేక్షకులు తనను సొంత ఇంటి మనిషిలా చూసుకుంటున్నారని వారికి జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. సినీ పరిశ్రమలో తాను ఒక హీరోకి జీవితాంతం రుణపడి ఉంటానని ఆమె తెలిపింది. ఆ హీరో చేసిన సహాయం తన జీవితంలో ఏంతో ఉపయోగపడిందని అన్నారు. మరి ఇంతకి ఆ హీరో ఎవరు అనుకుంటున్నారా.. ఆ హీరో ఎవరో కాదు.. టాలీవుడ్ టాప్ హీరో కింగ్ నాగార్జున. ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’ మూవీ షూటింగ్ టైంలో తనకి అపెండిసైటిస్ వల్ల తీవ్రమైన కడుపునొప్పి వచ్చిందని ఆమె అన్నారు. ఆ సమయంలో తాను షూటింగ్ బిజీలా ఉన్నానని ఏవో మాత్రలు వేసుకుంటూ మ్యానేజ్ చేస్తు షూటింగ్ కంప్లీట్ చేయాలన్న ఆలోచనలో ఉన్నానని..ఇలా రెండు రోజులు గడిచాయి.

మూడో రోజున మేకప్ చేసుకొని సెట్ కి వెళ్లానని.. ఆ సెట్లో సడెన్ గా కుప్పకూలి పోయానని అన్నారు. నా అదృష్టం కొద్ది షూటింగ్ సెట్ లో నాగార్జున ఉండటం.. వెంటనే ఆయన వాహనంలో తీసుకెళ్లి.. ‘అపోలో’ హాస్పిటల్లో చేర్పించారని చెప్పారు. వెంటనే ఆపరేషన్ చేయించడం వలన తాను బతికి బయటపడ్డానని అన్నారు. ఇప్పటికి.. ఎప్పటికి ఆ సంఘటన మర్చిపోలేనని.. ఈ రోజున తాను ఇంకా ఉన్నానంటే అందుకు కారణం నాగార్జున అని చెప్పుకొచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -