Tuesday, May 21, 2024
- Advertisement -

19 ఏళ్లకే.. రూ.100 కోట్లు సంపాదించిన యువకుడు.. ఎలానో తెలుసా..?

- Advertisement -

ప్రస్తుతం ఉన్న రోజుల్లో.. చదువు అయిపోగానే ఏదో ఒక కంపెనీలో జాబ్ చేయడానికి ఇష్టపడటం లేదు.. తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చేలా యువకులు ఆలోచిస్తున్నారు. తాజాగా ఒక 19 ఏళ్ల కుర్రాడు సాధించిన ఘనతను గురించి తెలుసుకుంటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

పాతికేళ్లు లేని ఆ కుర్రాడు ఇప్పుడు బ్రిటన్ కోటీశ్వరుల జాబితాలో ఒకడిగా ఉన్నాడు. అసలు విషయంలోకి వెళ్తే.. భారతీయ సంతతికి చెందిన అక్షయ్‌ రూపారెలియా (19).. స్కూలో ఉన్నప్పుడే బిజినెస్ లో ఉంటే లాజిక్స్ ను బాగా తెలుసుకున్నాడు. ఇక కాలేజ్ కు వచ్చేసరికి.. వెబ్ సైట్స్ మీద పట్టు సాదించాడు. ఈ నేపథ్యంలో అతనికి ఒక మంచి ఐడియా వచ్చింది. వెబ్ సైట్ ద్వారా ఏ విధంగా లాభాలు పొందవచ్చనే క్రమంలో ఎవరు అంతగా ఉపయోగించని కాన్సెప్ట్ తో ‘డోర్‌ స్టెప్స్‌.కో.యూకే’ వెబ్‌ సైట్‌ ని స్టార్ట్ చేశాడు. యూకేలో జీవనాన్ని కొనసాగిస్తూ స్వయం ఉపాధి పొందుతున్న తల్లుల నుంచి స్థిరాస్తి సమాచారం కరెక్ట్ గా సేకరించి ఆ విషయాన్ని సైట్లో పోస్ట్ చేయడం అతని కాన్సెప్ట్. దాన్ని ఆచరణలో పెట్టడానికి కూడా అక్షయ్ తన బంధువుల దగ్గర నుంచి 7వేల డాలర్లను అప్పుగా తీసుకున్నాడు.

ఆ కాన్సెప్ట్ కొన్ని రోజుల్లోనే బాగా క్లిక్ అయ్యింది. కేవలం 16 నెలలోనే 12 మిలియన్‌ పౌండ్ల బిజినెస్ కు చేర్చాడు. ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 6.02 లక్షలతో మొదలు పెట్టిన అతని వ్యాపారం ఇప్పుడు 100 కోట్లు దాటింది. ఇక ఈ బిజినెస్ బావుండటంతో మనోడు అక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఉన్నత విద్య కోసం అవకాశం వచ్చినా వెళ్ళలేదు. ఇప్పటివరకు వైబ్ సైట్ ద్వారా 100 మిలియన్‌ పౌండ్ల (దాదాపు 860 కోట్ల రూపాయలు) స్థిరాస్తులను విక్రయించానని అక్షన్ రీసెంట్ గా ఇచ్చిన ఇక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -