Friday, May 17, 2024
- Advertisement -

ఆమె కి అందాలు చూపించడం కుదరడం లేదు ?

- Advertisement -

కొంతమంది హీరోయిన్స్ అందం అభినయం అన్ని ఉన్నా బ్యాడ్ లక్ తమని వెంటాడుతు వస్తుంది. సరిగ్గా ఈ క్యారక్టర్ కు హీరోయిన్ అదా శర్మకు బాగా నప్పుతుంది. 1920 అంటూ బాలీవుడ్ సినిమాలో తన టాలెంట్ చూపించి మరి అవార్డ్ పొందిన ఈ అమ్మడు వెంటనే అక్కడ నుండి పూరి తీసిన హార్ట్ ఎటాక్ తో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చింది.

అయితే పూరి హీరోయిన్ కు తెలుగులో మంచి గిరాకి ఉన్నా ఎందుకో అదా దాన్ని వాడుకోలేకపోయింది. కథల విషయంలో తప్పటడుగులు వేస్తూ వచ్చిన ఈ అమ్మడు కొన్ని సినిమాల్లో అసలు కనీసం అవసరం లేని పాత్రల్లో నటించింది.

రీసెంట్ గా వచ్చిన క్షణం సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ తెలుగులో ఇంకా ఏ సినిమాకు ఓకే అవ్వలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం క్షణం రీమేక్ లో ఏకంగా సల్మాన్ ఖాన్ తోనే జోడి కడుతుందని వార్తలు వస్తున్నాయి. అంతేకాదు కమాండో-2 లో నటిస్తున్న అదా శర్మ తనలోని యాక్షన్ యాంగిల్ కూడా బయట పెడుతుందట. ఓ టాప్ హీరోయిన్ కు ఉండాల్సిన లక్షణాలు అన్ని ఉన్నా అదాకు మాత్రం అదృష్టం కలిసి రావట్లేదన్నది వాస్తవం. మరి ఈసారైనా అదా శర్మ హిట్ మేనియాను కంటిన్యూ చేస్తుందా లేదా అన్నది చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -