Saturday, April 27, 2024
- Advertisement -

జరిగింది పెళ్లి కాదు..ఎంగేజ్‌మెంట్

- Advertisement -

హీరో సిద్ధార్థ్ – హీరోయిన్ అదితీరావు హైదరీ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారని నిన్న మీడియా అంతా కోడై కూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించారు నటి అదితీ. జరిగింది పెళ్లి కాదు ఎంగేజ్‌మెంట్ అని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

ఎంగేజ్‌మెంట్ ఫోటోను షేర్ చేయగా ఇద్దరి చేతులకు ఉంగరాలున్నాయి. తాము వనపర్తి సమీపంలోని శ్రీరంగాపురంలోనే ఉన్నామని లొకేషన్ వివరాలను కూడా షేర్ చేశారు.

మహాసముద్రం సినిమా సందర్భంగా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఇద్దరూ కలిసి దర్శనమిచ్చారు. అయితే వీరిద్దరి రిలేషన్‌ షిప్‌పై ఎన్ని వార్తలు వచ్చినా స్పందించలేదు. తాజాగా పెళ్లి రూమర్‌తో తాము ఎంగేజ్‌మెంట్ చేసుకున్నామని తెలిపారు అదితి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -