Saturday, April 27, 2024
- Advertisement -

వలసవాదులకు టికెట్లా..బీజేపీలో అసమ్మతి

- Advertisement -

తెలంగాణ బీజేపీలో అసమ్మతి తారాస్థాయికి చేరుకుంది. పార్టీ కోసం కష్టపడిన వారికి కాకుండా వలస వాదులకు టికెట్లు ఇవ్వడాన్ని సీనియర్ నేతలు తప్పుబడుతున్నారు. ప్రధానంగా వరంగల్,ఆదిలాబాద్,నల్గొండ అభ్యర్థులను మార్చాలని బీజేపీ పెద్దలను డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు కూడా.

ఇక హైదరాబాద్ టికెట్ మాధవీలతకు ఇవ్వడాన్ని రాజాసింగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిన సైదిరెడ్డి, ఆరూరి రమేశ్‌లను మార్చాల్సిందేనని బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుండటంతో పార్టీ నేతలు సంకటంలో పడ్డారు. అలాగే ఆదిలాబాద్ టికెట్ ను నగేశ్ కు కేటాయించడాన్ని సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావు, రమేశ్ రాథోడ్ వ్యతిరేకిస్తున్నారు. ఇక నాగర్ కర్నూల్ టికెట్ ప్రకటించిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డితో బీజేపీ సీనియర్ నేత బంగారు శృతి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో మరింతమంది నాయకులు పార్టీ మారే అవకాశం ఉందని తెలుస్తోంది.

కొత్తగా పార్టీలోకి వచ్చి టికెట్లు దక్కించుకున్న వారికి సహకరించేది లేదని బీజేపీ నేతలు తెగేసి చెబుతున్నారు. అలాగే ఈ మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చకపోతే సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు. దీంతో బీజేపీ టికెట్ వచ్చినా ప్రచారం చేసుకోలేని పరిస్థితి ఈ మూడు నియోజకవర్గాల్లో నెలకొంది. మొత్తంగా తెలంగాణలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ఆశ పడుతున్న బీజేపీకి జరుగుతున్న పరిణాలమాలు మింగుడు పడటం లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -