Saturday, May 4, 2024
- Advertisement -

మహేష్ బాబు అంటే పడి చస్తున్న హీరోయిన్

- Advertisement -

టాలీవుడ్ లో హీరోలు ఎంతమంది ఉన్నా సరే హీరోయిన్స్ మనసు దోచుకునేది మాత్రం ఒక్క సూపర్ స్టార్ మహేష్ మాత్రమే. మహేష్ అందానికి ఏ హీరోయిన్ అయినా సరే డామినేట్ చేయలేక ఏదో అలా అడ్జస్ట్ అవ్వాల్సిందే. అయితే కేవలం హీరోయిన్స్ కే కాదు ఇంకా పరిశ్రమలో అడుగుపెట్టని వారికి కూడా మహేష్ అంటే అదో రకమైన మోజు.

ఇక మహేష్ ను ఇష్టపడే హీరోయిన్ల్స్ లిస్ట్ ఎంతో ఉంది తాజాగా ఆ లిస్ట్ లో తాను కూడా ఉన్నానంటుంది పూరి కొత్త హీరోయిన్ అదితి ఆర్య. 2015 మిస్ ఇండియా వరల్డ్ గా కిరీటం దక్కించుకున్న అదితి ఆర్య తెలుగు సినిమాలను కూడా చూస్తుందట.  

అంతేకాదు పూరి దర్శకత్వంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తునందుకు తాను చాలా సంతోషంగా ఉందట. ఇక టాలీవుడ్ విశేషాలను గురించి చెబుతూ తనకు సూపర్ స్టార్ మహేష్ అంటే చాలా ఇష్టమని ఎప్పటికైనా మహేష్ తో నటించాలనేది తన కోరికని అన్నది. సో తెలుగులో కనీసం ఒక్క సినిమా కూడా చేయక ముందే సోయగాలు పోతున్న ఈ చిన్నది చూస్తుంటే ఇక్కడ పర్మనెంట్ గా స్టార్ స్టేటస్ సంపాదించే దాకా వదిలి వెళ్లేలా లేదు. ఇక దాని కోసమే ఇప్పటికే తెలుగు క్లాసులకు కూడా వెళ్తుందట. మరి ఇంత కష్టపడుతున్న అదితి ఆర్యకు టాలీవుడ్ ఎలాంటి వెల్ కమ్ చెబుతుందో చూద్దాం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -