Friday, April 26, 2024
- Advertisement -

వెంకటేష్ పూరి కాంబినేషన్లో సినిమా!

- Advertisement -

విక్టరీ వెంకటేష్ నటిస్తున్న బాబు బంగారం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. గోపాల గోపాల తర్వాత కొద్ది పాటి గ్యాప్ తో వస్తున్న వెంకీ ఈసారి సినిమాల కథల విషయంలో చాలా చురుగ్గా ఉంటుందాడట. ఇక ఇదే క్రమంలో వెంకటేష్ పూరి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా రాసుకున్న ఆటోజాని కథ చిరు వద్దనడంతో దాన్ని రవితేజతో తీసేందుకు సిద్ధమైన పూరి. సురేష్ బాబు సలహాతో వెంకటేష్ తో తీసేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. సో వెంకటేష్ పూరి కాంబినేషన్లో వచ్చే సినిమా చిరు 150వ సినిమా కథే అంటూ ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతుంది.

ప్రస్తుతం పూరి కూడా కళ్యాణ్ రామ్ తో రీమిక్స్ సినిమా చేస్తున్నాడు. దాని తర్వాత వెంకీ సినిమా ఉండొచ్చని అంచనా.. మరి చిరు చేయాల్సిన సినిమా వెంకటేష్ చేస్తే ఎలా ఉంటుందో ఆటో జాని సినిమా రిలీజ్ తెర రూపం దాల్చుకుంటే కాని చెప్పలేం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -