Monday, May 20, 2024
- Advertisement -

దూకుడు పెంచిన జగన్‌…బస్సుయాత్ర షెడ్యూల్ ఇదే

- Advertisement -

వై నాట్ 175,వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాలతో నిత్యం ప్రజల్లో ఉండేలా బస్సుయాత్రను నిర్వహించనున్నారు ఏపీ సీఎం జగన్. ఈ మేరకు బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్రకు వచ్చే ప్రజలను ఏం ప్రశ్నలు అడగాలి, వారిని ఏ విధంగా చైతన్యం చేయాలి అనే దానిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది వైసీపీ.

ఇందులో భాగంగా సామాజిక న్యాయ యాత్ర పేరుతో జరిగే ఈ బస్సు యాత్రలో భాగంగా ప్రతీ రోజు మూడు ప్రాంతాల్లో వైసీపీ నేతలు పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి నవంబర్ 9 వరకు మొదటి విడత బస్సుయాత్ర జరగనుంది. ఆదివారాలు మినహా ప్రతీరోజు యాత్ర సాగనుంది.

ఇక తొలిరోజు అక్టోబర్ 26న ఇచ్చాపురం, తెనాలి, శింగ‌న‌మ‌ల‌, అక్టోబ‌ర్ 27న గజ‌ప‌తిన‌గ‌రం, న‌ర‌సాపురం, తిరుప‌తి, అక్టోబ‌ర్ 28న భీమిలి, చీరాల, పొద్దుటూరు,అక్టోబ‌ర్ 30న పాడేరు, దెందులూరు, ఉద‌య‌గిరి,అక్టోబ‌ర్ 31న ఆముదాల‌వ‌ల‌స, నందిగామ, ఆదోనిలలో జరగనుంది.

న‌వంబ‌ర్ 1న పార్వతీపురం, కొత్తపేట, క‌నిగిరి, నవంబ‌ర్ 2న మాడుగుల, అవ‌నిగ‌డ్డ, చిత్తూరు,నవంబ‌ర్ 3న న‌ర‌స‌న్నపేట, కాకినాడ రూర‌ల్, శ్రీకాళ‌హ‌స్తి,న‌వంబ‌ర్ 4న శృంగ‌వ‌ర‌పుకోట, గుంటూరు ఈస్ట్, ధ‌ర్మవ‌రం,న‌వంబ‌ర్ 6న గాజువాక, రాజ‌మండ్రి రూర‌ల్, మార్కాపురం, నవంబ‌ర్ 7న రాజాం, వినుకొండ, ఆళ్లగ‌డ్డ, న‌వంబ‌ర్ 8న సాలూరు, పాల‌కొల్లు, నెల్లూరు రూర‌ల్,న‌వంబ‌ర్ 9న అన‌కాప‌ల్లి, పామ‌ర్రు, తంబ‌ళ్లప‌ల్లె యాత్ర జరగనుంది. మొత్తంగా డిసెంబ‌ర్ 31 వ‌ర‌కూ 60 రోజుల పాటు సభలు జరగనున్నాయి. ఈ బ‌స్సు యాత్రకు ఎక్కడికక్కడ స్ధానిక ఎమ్మెల్యేలు అధ్యక్షత వహించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -