Tuesday, April 30, 2024
- Advertisement -

అమిత్‌ షాతో భేటీకి లోకేష్ ఏం చేశారో తెలుసా?

- Advertisement -

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత బీజేపీ పెద్దలను కలిసేందుకు ఆ పార్టీ నేత నారా లోకేష్ చేయని ప్రయత్నం లేదు. ఏకంగా ఢిల్లీలో 20 రోజులకు పైగా మకాం వేసిన ఫలితం లేకపోయింది. దీంతో నిరాశతో ఏపీకి చేరుకున్న లోకేష్‌కి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రూపంలో అవకాశం దక్కింది.

ఇక ఈ భేటీ తర్వాత లోకేష్ చేసిన వ్యాఖ్యలు బీజేపీని డిఫెన్స్‌లో పడేశాయి. అమిత్ షానే స్వయంగా పిలిచి బాబు అరెస్ట్‌ గురించి ఆరా తీశారని చెప్పారు. అయితే తాజాగా దీనిని ఖండించారు కిషన్ రెడ్డి. లోకేష్‌ పదే పదే అమిత్ షా అపాయింట్ మెంట్ అడిగారని తేల్చిచెప్పారు. తర్వాతే అపాయింట్‌మెంట్ లభించిందన్నారు. దీంతో స్వయంగా అమిత్ షానే తనను పిలిచారని చెప్పడం అబద్దమని తేలిపోయింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు సెప్టెంబర్ 9న అరెస్ట్ కాగా 14 నుండి దాదాపు 20 రోజుల పాటు ఢిల్లీలోనే ఉన్నారు. ఏసీబీ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టులో జరుగుతున్న విచారణలపై న్యాయనిపుణులతో చర్చించారు. ఈ క్రమంలోనే బీజేపీ పెద్దలను కలిసే ప్రయత్నం చేయగా సాధ్యపడలేదు. చివరకు అక్టోబర్‌ 11న సిఐడి విచారణకు వచ్చిన లోకేష్‌ అదే రోజు సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి షాతో భేటీ అయ్యారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -