Saturday, May 4, 2024
- Advertisement -

వెంకీతో న‌టించ‌లేమ‌న్న‌కాజ‌ల్‌, త‌మ‌న్నా, అదితీరావ్ హైద‌రీ

- Advertisement -

విక్ట‌రీ హీరోకు హీరోయిన్ల షాక్‌

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం ఆరు, ఏడు ప‌దుల వ‌య‌సు వ‌స్తున్నా ఇంకా హీరోలుగా కొన‌సాగుతూ సినిమాలు చేస్తున్న వాళ్లు చాలామందే ఉన్నారు. వాళ్లు ఇంకా కుర్ర హీరోయిన్ల‌తో క‌లిసి ప్రేమాయ‌ణం చేయ‌డం మ‌న ప‌రిశ్ర‌మ‌లోనే ఉంది. ల‌వ్‌లు, డ్యాన్స్‌లు, ఫైట్స్ కుర్ర హీరోల మాదిరిగా చేయ‌డం ఇక్క‌డే సాధ్యం. అయితే ఆ హీరోల‌కు హీరోయిన్ల ఎంపిక చాలా క‌ష్ట‌మైపోయింద‌బ్బా. వారితో న‌టించ‌డానికి హీరోయిన్లు వెనుకంజ వేస్తున్నారు.  న‌టించాలంటే రెమ్యున‌రేష‌న్ ఎక్కువ అడ‌గ‌డ‌మో, లేదా ఫ్లాపు హీరోయిన్ల‌తో సినిమా చేయించ‌డ‌మో జ‌రుగుతోంది. ఇప్పుడు ఆ కోవ‌లో విక్ట‌రీ, ద‌గ్గుబాటి వెంకటేశ్ ఉన్నాడు.

ప్ర‌స్తుతం ఆయ‌న ఐదు ప‌దులు దాటుతోంది. స‌రైన విజ‌యాలు కూడా వెంక‌టేశ్‌కు ఈ న‌డిమ‌ధ్య‌లో ఏమీ లేవు. దీంతో ఆయ‌న్ను హీరోయిన్లు ప‌క్క‌న పెట్టేస్తున్నారు. ప్ర‌స్తుం వెంకటేశ్ ప‌లు సినిమాల్లో న‌టించేందుకు అంగీక‌రించాడు. అయితే ఆ సినిమాల్లో నటించేందుకు హీరోయిన్లు అశ్ర‌ద్ధ చేస్తున్నారు. దర్శకుడు తేజ డైరెక్షన్లో తెరకెక్కనున్న చిత్రంలో విక్టర్ వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన సరసన హీరోయిన్‌గా బుక్ చేసేందుకు తేజ ఇప్పటికే తమన్నా, కాజల్ అగర్వాల్‌ను అడిగారంట‌. అయితే వాళ్లిద్దరూ నో చెప్పేశారట. అత‌డితో తాము ఎలా చేస్తామంటూ ప్రశ్నించారని టాక్‌. ఈ నేపథ్యంలో అదితీరావ్ హైదరీని సంప్రదిస్తే చివరికి ఆమె కూడా అబ్బే… వెంకీతో తను చేయలేనని తేల్చేసిందట స‌మాచారం మ‌రీ సీనియ‌ర్ న‌టుడి ప‌క్క‌న ఎవ‌రు న‌టిస్తారో చూడాలి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -