- Advertisement -
బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంలో మరోసారి నటి హేమకు నోటీసులు ఇచ్చారు బెంగళూరు పోలీసులు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. తొలుత ఈ నెల 27న నోటీసులు ఇవ్వగా జ్వరం కారణంగా విచారణకు హాజరుకాలేనని ఆమె తెలిపారు.
అయితే ఇందుకు ఒప్పుకోని పోలీసులు విచారణకు రావాలని కోరుతూ మరోసారి లేఖ రాశారు. ఈ కేసులో మొత్తం 86 మందికి నోటీసులు ఇవ్వగా ఒక్కరూ కూడా విచారణకు హాజరుకాలేదు.
ఈ రేవ్ పార్టీకి మొత్తం 150 మంది హాజరు కాగా, 105 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 86 మందికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్‌గా తేలింది.
ఎక్కువ మోతాదులో డ్రగ్స్ తీసుకున్నవారు ఎనిమిది మంది ఉన్నారు. మరి నోటీసులు అందుకున్న వారు విచారణకు హాజరవుతారో లేదో వేచిచూడాలి.