- Advertisement -

కోర్టు నుంచి కేవియేట్ పిటిష‌న్ తెచ్చుకున్న ఆజ్ణాత‌వాసి టీమ్‌….?

- Advertisement -

అజ్ణాత వాసి సినిమా విడుద‌ల‌కు సిద్ద‌మైన త‌రునంలో కాపీ రైట్స్ స‌మ‌స్య వెంటాడుతోంది. ఫ్రెంచి సినిమా ‘లార్గోవించ్’ను కాపీ చేసి ఈ సినిమాను రూపొందించారనే ప్రచారం గత కొన్నాళ్లుగా సాగుతోంది. ఇదే సమయంలో సదరు సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సీరిస్ కొనుగోలు చేసిందనే మాట వినిపిస్తోంది.

ఇదే సమయంలో సదరు సినిమా రీమేక్ రైట్స్ ను బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సీరిస్ కొనుగోలు చేసిందనే మాట వినిపిస్తోంది. దీనికి సంబంధించి అజ్ఞాత‌వాసి రూపకర్తలకు-టీ సీరిస్ కు మధ్య చర్చలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

పది కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని టీ సీరిస్ సంస్థ డిమాండ్ చేస్తోందని, అజ్ఞాత‌వాసి రూపకర్తలు మాత్రం ఐదు కోట్ల రూపాయలతో డీల్ సెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా కూడా కబుర్లు వినిపిస్తున్నాయి. అయితే వీటిలో దేనికీ ధ్రువీకరణ లేదు. అయితే ఈ వివాదంపై సినిమా యూనిట్ ఎవ‌రూ స్పందించ‌లేదు.

అయితే ఇప్పుడు తాజాగా మ‌రో వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అసలే కాపీ వివాదాలు ముసురుకోవడం.. ‘లార్గో వించ్’ దర్శకుడు జెరోం సల్లే కూడా సినిమా చూస్తానంటూ ట్వీట్ చేయడంతో.. ఎందుకైనా మంచిదని అజ్ఞాతవాసి నిర్మాతలు ‘కేవియట్’ తెచ్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

లాస్ట్ మినిట్‌లో సినిమాపై టీ-సిరీస్ ఎక్కడ కోర్టు మెట్లు ఎక్కుతుందోనన్న భయంతో.. ముందస్తుగా ‘కేవియట్’ తెచ్చుకున్నట్లు చెబుతున్నారు. కేవియట్ ద్వారా సినిమా ప్రదర్శనకు ఆటంకం ఏర్పడకుండా ఉంటుందని ఈ పని చేసినట్లు తెలుస్తోంది. దీని వల్ల అజ్ఞాత‌వాసి కథ కాపీ అని ఎవరైనా కోర్టుకు వెళ్లినా.. ముందుగా ఈ సినిమా రూపకర్తల వాదనకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ దీనిమీద స్పందించ‌లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -