Monday, April 29, 2024
- Advertisement -

స‌ఫారీల దూకుడుకు అడ్డుక‌ట్ట వేసిన బుమ్రా, పాండ్య….

- Advertisement -

 ద‌క్షిణాఫ్రికాతో కేప్ టౌన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ బౌలర్లు మళ్లీ పుంజుకున్నారు. మ్యాచ్ ఆరంభంలోనే 12/3తో దక్షిణాఫ్రికాను ఒత్తిడిలో పడేసిన భారత బౌలర్లు.. ఏబీ డివిలియర్స్ (65: 84 బంతుల్లో 11×4), కెప్టెన్ డుప్లెసిస్ (62: 104 బంతుల్లో 12×4) శతక భాగస్వామ్యం ధాటికి పట్టు జారవిడిచారు.

తొలి సెషన్ నుంచే బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ ఈ జోడి.. సమర్థంగా పరుగులు రాబడుతూ నాలుగో వికెట్‌కి ఏకంగా 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. దీంతో 31.5 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 123/3తో మెరుగైన స్థితిలో నిలిచింది. భారీ స్కోరు దిశ‌గా వెల్తూ ప్రమాదకరంగా మారిన ఈ జోడిని బుమ్రా విడదీయగా..తర్వాత హార్దిక్ ఒక వికెట్ పడగొట్టి సఫారీ జట్టుని మళ్లీ ఒత్తిడిలోకి నెట్టాడు.

తాజా టెస్టుతో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన బుమ్రా.. ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో ఏబీ డివిలియర్స్‌ని బోల్తా కొట్టించి కెరీర్‌లో తొలి టెస్టు వికెట్‌ని ఖాతాలో వేసుకున్నాడు. ఆఫ్ స్టంప్‌కి సమీపంలో విసిరిన బంతిని.. డ్రైవ్ చేసేందుకు ఏబీ విఫలయత్నం చేశాడు. బంతి.. అతని బ్యాట్ అంచున తాకుతూ వెళ్లి వికెట్లని గీరాటేసింది. అనంతరం కొద్దిసేపటికే హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో బంతిని ప్లిక్ చేసేందుకు ప్రయత్నిస్తూ డుప్లెసిస్ వికెట్ కీపర్ సాహాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 142/5తో మళ్లీ సఫారీ జట్టు ఇబ్బందుల్లో ప‌డింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -