Saturday, May 18, 2024
- Advertisement -

మహేష్ ని తలదన్నేసిన అఖిల్….!!!!

- Advertisement -

మొదటి సినిమా షూటింగ్ కూడా మొదలు కాక ముందరే పెద్ద పెద్ద యాడ్ లు తన చేత్తోకి లాక్కున్నాడు హీరో అఖిల్ . మౌంటెన్ ద్యూ, టైటాన్ , బ్లూ క్రాస్ , కార్బన్ మొబైల్ ఇలా ఒకటేంటి చాలా బ్రాండ్ లు తన బుట్టలో వేసుకున్నాడు.

ఇప్పుడు మహేష్ బాబుకే టెండర్ పెట్టేసి ఆయన ‘ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ‘ బ్రాండ్ ని తన వైపు లాక్కున్నాడు అఖిల్. బుడి బుడి అడుగులతోనే మహేశ్ లాంటి భారీ సూపర్ స్టార్ రేంజ్ బ్రాండ్ ని తనతో పెట్టుకున్నాడు అఖిల్ ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు. రెండేళ్ళ క్రితం మహేష్ బాబుతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నసమయంలో  సుమారు ఏడు కోట్లు తీసుకుని సంతకం పెట్టాడు .

ఇపుడు ఆ బంతి అఖిల్ చేతికి చిక్కింది. ఎంత ఇస్తున్నారో తెలీదు కానీ అఖిల్ కి సూపర్ బ్రాండ్ దక్కింది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫోటో ల లో మహేష్ బదులు ఇప్పుడు అఖిల్ కనిపించ బోతున్నాడు. అంత స్టార్ డం వచ్చాక మహేష్ కి సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ లాంటివి దక్కితే అఖిల్ మాత్రం చాలా తక్కువ సమయంలో మహేష్ ని తల దన్నేసాడు . 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -