Wednesday, May 15, 2024
- Advertisement -

ధోనీకి ఇష్ట‌మైన టెన్నిస్ క్రీడాకారుడు ఎవ‌రో తెలుసా…?

- Advertisement -

మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందుల్కర్‌ అభిమాన టెన్నిస్‌ ప్లేయర్‌ ఎవరో అందరికీ తెలుసు. అతనే స్విస్‌ దిగ్గజం, ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ రోజర్‌ ఫెదరర్‌. ఫెదరర్‌ ఎక్కడ మ్యాచ్‌లు ఆడుతున్నా సచిన్‌ అక్కడికి వెళ్లిపోతూ ఉంటాడు. ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టోర్నీకైతే సచిన్‌ తప్పనిసరిగా హాజరైపోతుంటాడు..

మరి ధోనీ ఫేవరెట్‌ ప్లేయర్‌ ఎవరు? రోజర్‌ ఫెదరరా లేక అతన్ని గడగడలాడించిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదలా?. మ్యాచ్‌ గెలిచేందుకు చివరి క్షణం వరకు పోరాడే రఫెల్‌ నాదలే ధోనీ అభిమాన టెన్నిస్‌ ప్లేయర్‌. నాదల్‌ ఆటను ధోనీ నేరుగా చూడకపోయినా ఎన్నో ఏళ్ల నుంచి అతన్ని ఫాలో అవుతూనే ఉన్నాడు.

ఓ ఇంట‌ర్వ్యూలో త‌న అభిమాన టెన్నిస్ క్రీడాకారుడు ర‌ఫెల్ నాద‌ల్ అని ధోనీ వెల్ల‌డించాడు. అంతే.. ఎందుకు ఇష్టమో వివ‌రిస్తూ విశ్లేష‌ణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ విశ్లేష‌ణ‌ల్లో భాగంగా ఒక విష‌యం మాత్రం అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. వ‌ర‌ల్డ్ ఫేవ‌రెట్ టెన్నిస్ ఆట‌గాడు రోజ‌ర్ ఫెద‌ర‌ర్‌ని కూడా గ‌డ‌గ‌డ‌లాడించిన స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌కి, మ‌హేంద్ర‌సింగ్ ధోనీకి ఓ చిన్న పోలిక ఉంది. వారిద్ద‌రి ఆడే విధానాలు దాదాపు ఒకేలా ఉంటాయి.

ఇతరుల కంటే మెరుగైన ప్రదర్శన చేయ‌డం, విజ‌యం కోసం వెంప‌ర్లాడ‌టం వీరిద్ద‌రిలోనూ క‌నిపిస్తుంది. ఈ ఆట‌తీరు కార‌ణంగానే వారు తమ తమ క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగారు. ఇక్క‌డ చెప్పుకోద‌గ్గ విష‌యం ఏంటంటే… ధోనీ ఇంత‌వ‌ర‌కు ర‌ఫెల్ నాద‌ల్ మ్యాచ్‌ను ప్ర‌త్య‌క్షంగా చూడ‌లేదు కానీ, ఆయ‌న ప్ర‌తి ఆట‌ను మాత్రం త‌ప్ప‌కుండా చూస్తారు.

అందుకే వారు తమ తమ క్రీడల్లో అత్యున్నత స్థాయికి చేరుకోగలిగారు. దేశానికి మరుపురాని విజయాలను అందించారు. శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్‌లు ముగియడంతో ధోనీకి కావాల్సినంత విరామం దొరికింది. టెస్టు సిరీస్‌ కోసం కోహ్లీ సేన ఈ రోజు దక్షిణాఫ్రికా వెళ్లనుంది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1న తొలి వన్డే జరగనుంది. ఆ సమయానికి ధోనీ అక్కడికి చేరుకుంటాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -