Sunday, May 19, 2024
- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అఖిల్?

- Advertisement -

అఖిల్ మొదటి సినిమా ప్లాప్ కావడంతో ఇప్పుడు అక్కినేని అభిమానులు అఖిల్ రెండో సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే మరి అఖిల్ రెండో సినిమాని ఎవరు డైరెక్ట్ చేయాబోతున్నారు అనే విషయంపై ఇంక క్లారిటి రాలేదు. ఐతే తాజాగా ఓ వార్త సినీ పరిశ్రమలో హల్ చల్ చేస్తుంది.

నాన్నకు ప్రేమతో చిత్రంతో ఎన్టీఆర్‍కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సుకుమార్ అఖిల్‍ రెండో సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు అనే గుస గుసలు వినిపిస్తున్నాయి. ఐతే సుకుమార్ దేవి శ్రీ ప్రసాద్ ను హీరోగా పరిచయం చేయాల్సి ఉంది కానీ ఈ సినిమా లెట్ అయ్యేటాట్లు ఉండటంతో అఖిల్ రెండో సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించే ఛాన్స్‌లు ఉన్నాయి అంటున్నారు.

నాన్నకు ప్రేమతో మంచి జోష్ మీద ఉన్న సుకుమార్‍ని నమ్మి నాగార్జున అఖిల్‍ను అతని చెతిలో పెడుతాడో లెదో చూడాలి మరి. కొన్ని రోజులుగా నాగార్జున తన సినిమాలతో బిజీగా ఉండటంతో అఖిల్ రెండో సినిమాపై దృష్టి పెట్టలేకపోయాడు. ఐతే తాజాగా అఖిల్ కోసం టాలీవుడు టాప్ డైరెక్టర్స్‌ క్యూలో పెడుతున్నాడట. మరి అఖిల్ రెండో సినిమాని సుకుమార్‍ దర్శకత్వం వహిస్తాడా  లేదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -