Saturday, May 11, 2024
- Advertisement -

పవన్ ఫ్యాన్స్‌కి కోపం తెప్పిస్తున్న బన్నీ

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్‍. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‍లో వేసిన భారీ సెట్‍లో షూటింగ్ జరుపుకుంటుంది. పవన్ సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాని ఎలాగైన ఈ సమ్మర్‍ కానుకగా  ఏప్రిల్‌ 8న విడుదలకు ప్లాన్ చేసాడు పవన్.

అందుకోసం రెస్ట్‌ లేకుండా సినిమా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఐతే పవన్ సినిమా విడుదలవుతున్న రోజే బన్నీ ‘సరైనోడు’  సినిమాని కూడా రిలీజ్ చేయాలి చూస్తున్నారట. ఐతే ఏప్రిల్‌ 8న అల్లు అర్జున బర్త్‌డే ఉండటంతో అదే రోజు ‘సరైనోడు’ సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారట. సో పవన్‍కి పోటీగా బన్నీ తన సినిమాతో రాబోతున్నాడు. ఐతే ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు బన్నీపై కోపడుతున్నారు.

ఐతే బన్నీ ‘సరైనోడు’ రిలీజ్ పై ఇంక క్లారిటీ రాలేదు కానీ ఏప్రిల్‌ 8న రిలీజ్‍కి ప్లాన్ అయితే చేస్తున్నారట. త్వరలో నే ఈ సినిమా విడుదలపై ఓ క్లారిటీ రానుంది. బొయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కుతున్న ‘సరైనోడు’ లో హీరోయిన్స్‌గా రకుల్, కేథరిన్‍లు నటిస్తుండగా అల్లు అరవింద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సో పవన్‍కి పోటిగా బన్నీ వస్తాడో లెదో చూడాలి మరి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -