Monday, April 29, 2024
- Advertisement -

సూర్య కి సెకండ్ హాఫ్ రాసిచ్చిన త్రివిక్రమ్

- Advertisement -

సింగం 3 స్టార్ సూర్య హైదరాబాద్ లో హడావిడి చేస్తున్నాడు. ఒక స్టార్ హోటల్ లో కూర్చుని కనిపించాడు . తన సినిమా షూటింగ్ కోసం రాలేదు తన కొత్త ప్రాజెక్ట్ గురించి మాట్లాడ్డం కోసం వచ్చాడు. అదీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో. తెలుగు తమిళ బాషలలో తెరకి ఎక్కుతున్న వీరిద్దరి కాంబినేషన్ సినిమా కోసం సూర్య త్రివిక్రమ్ ని కలిసినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం 24 సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న సూర్య ఇప్పటికే ఈ సినిమా ని ఏప్రిల్ 14 న విడుదల కి సిద్దం చేస్తున్నాడు. మరొక పక్క సింగం 3 షూటింగ్ లో పాల్గొంటూ త్రివిక్రమ్ సినిమా కి సంబంధించిన చర్చల్లో బిజీ గా కనిపిస్తున్నాడు. మరోవైపు త్రివిక్రమ్ కూడా ఇప్పుడు అ..ఆ.. చిత్రాన్ని ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికి దాదాపు 70శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాను కూడా సమ్మర్ నాటికే విడుదల చేయాలని మాటల మాంత్రికుడు భావిస్తున్నాడు.  

ఇద్దరూ మొన్నా మధ్య ఫస్ట్ హాఫ్ గురించి కథా చర్చలు సాగించారు. ఇప్పుడు ఈ సినిమా కి సంబంధించి సెకండ్ హాఫ్ ని త్రివిక్రమ్ సూర్య కి ఇచ్చాడు. దీని మీద వీరిద్దరూ గంటలకి గంటలు డిస్కస్ చేసుకున్నారు అని తెలుస్తోంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -