Saturday, April 20, 2024
- Advertisement -

బ్రేకింగ్….. ‘హలో’ సినిమా కథ నాగ్‌కి బాలకృష్ణ చెప్పాడా?

- Advertisement -

నిజంగా నిజం ఇది. ఇండస్ట్రీలో కూడా చాలా మందికి తెలుసు. అఖిల్ సినిమా ఫ్లాప్ తర్వాత అఖిల్‌ హీరోగా నటించిన ‘హలో’ సినిమా కథ బేసిక్ ఐడియా బాలయ్యదే. పైగా అఖిల్‌కి ఇలాంటి కథ సూట్ అవుతుందని కూడా స్వయంగా బాలయ్యనే చెప్పాడు. ఆ రకంగా అఖిల్‌కి రెండో సినిమాతోనే హిట్ దక్కేలా చేశాడు బాలయ్య. ఏంటి అనుమానంగా ఉందా? సంవత్సరాల నుంచీ కూడా బాలయ్యకు-నాగార్జునకు అస్సలు పడడం లేదు కదా…..అలాంటప్పడు అఖిల్ కోసం బాలయ్య కథ రాయడమేంటి? ఆ కథను నాగార్జునకు చెప్పడమేంటి అని ఆలోచిస్తున్నారా? అయితే కాస్త ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళాల్సిందే.

‘అఖిల్’ సినిమా రిలీజ్ అయింది. అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే అదే సందర్భంలోనే మీడియా వాళ్ళు బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడు? ఎలాంటి కథతో వస్తాడు అని బాలయ్యను అడిగారు. నాగార్జునపైన ఎందుకో చాలా కోపంగా ఉన్న బాలయ్య పరోక్షంగా ‘అఖిల్’ సినిమాపై సెటైర్స్ వేస్తూ మాట్లాడాడు. మొదటి సినిమాకే ప్రపంచాన్ని కాపాడాడు లాంటి కథలు చెయ్యకూడదు. ప్రేమించిన ప్రేయసిని కాపాడుకునే లాంటి కథ చాలు అని చెప్పాడు. ఆ వెంటనే మీడియా మొత్తం అఖిల్ సినిమాపై, అలాగే అఖిల్‌ని అలాంటి సినిమాతో ఇంట్రడ్యూస్ చేసిన నాగ్ నిర్ణయంపై బాలయ్య సెటైర్స్ వేశాడంటూ వార్తలు రాసేసింది. ఆ తర్వాత బాలయ్య కామెంట్స్ గురించి నాగార్జునను కూడా అడిగారు. ఎవ్వరితోనూ గొడవలు పెట్టుకోవడం నాగార్జున నైజం కాదు. అందుకే బాలయ్య చెప్పిన మాటల్లో తప్పేముంది? ఆయన కరెక్ట్‌గానే చెప్పారు. లోకాన్ని కాపాడేలాంటి కథలు అప్పుడే అఖిల్ చెయ్యకూడదు. తన ప్రేయసిని కాపాడుకున్నాడు అన్న స్థాయి కథ చాలు అనేశాడు. ఇప్పుడు ‘హలో’ సినిమా కథ కూడా యాజ్ ఇట్ ఈజ్‌గా అదే. నిజానికి ఈ కథ చాలా పాతది. అయితేనేం విక్రమ్ కుమార్ సూపర్బ్ క్వాలిటీ మేకింగ్‌తో అఖిల్‌కి హిట్టిచ్చాడు. అలాగే ప్రేయసిని కాపాడుకునే స్థాయి కథలు చాలు అన్న బాలయ్య సలహా కూడా వర్కవుట్ అయినట్టుగా అయింది. ఆ రకంగా ‘హలో’ కథ క్రెడిట్‌లో కాస్తంత బాలయ్యకు కూడా దక్కుతుందన్న గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -