Friday, May 3, 2024
- Advertisement -

అక్కినేని ఫ్యామిలీ సమంత ఏం గిప్ట్ ఇవ్వనున్నారో తెలుసా ?

- Advertisement -

నాగ చైతన్య సమంత ల పెళ్లి ఈ రోజు(అక్టోబర్ 6 )న జరగనుంది. గోవాలో ఓ పెళ్లి జరగనుంది. వీరిద్దరి పెళ్లి వేడుకక కోసం హీరో నాగార్జున పది కోట్ల రూపాయలను కేటాయించినట్టు సమాచారం. పైగా, పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని చైతూ – సామ్‌లే ఇవ్వనున్నారట. 100 మంది అతిథులు మాత్రమే హాజరుకానున్నారట.

అక్టోబర్ 7 న సాయంత్రం 6 గంటలకు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి. ఇంకొద్ది సేపట్లో గోవాలో నిరాడంబరంగా నాగ చైతన్య, సమంతల వివాహం జరుగనుండగా, అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ మొత్తం కలసి సమంతకు వెల్ కమ్ చెబుతూ ఓ చిన్న వీడియోలో యాక్ట్ చేశారు. పెళ్లి జరుగుతున్నప్పుడు ప్రదర్శించేందుకు ఈ వీడియోను రూపొందించారు.

ఎగ్జాట్ గా పెళ్లి జరిగే సమయాన వారికి సర్ప్రైస్ ఇవ్వడానికి చాలా రహస్యంగా ఉంచారు ఈ విషయాన్ని.. సమంతకు సర్ ప్రైజ్ గా ఈ వీడియోను కానుకగా ఇవ్వాలని భావించిన రెండు ఫ్యామిలీలూ ఆమెకు స్వాగతం చెబుతూ కనిపిస్తాయి. ఈ వీడియోలో నాగార్జున, అమల, అఖిల్ తో పాటు వెంకటేష్, రానా, సుమంత్ తదితరులు కనిపించనున్నారట. ఈ వీడియో సమంతకు స్వీట్ సర్ప్రైస్ చేయనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -