- Advertisement -

టంగ్ స్లిప్ అయితే.. 23 మంది పోయారు

- Advertisement -

పెద్ద ప్రమాదాలుగా చెప్పుకునే చాలా సంఘటనలు చిన్నపాటి తప్పిదంతో జరుగుతుంటాయి. ఈ మాటలో ఎంత నిజముందో తెలియాలంటే ముంబాయిలో జరిగిన సంఘటన గురించే చెపుకోవల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా చర్చకు దాసి తీసిన ఈ సంఘటన… ముంబయి ఎల్ఫిన్ స్టన్ రైల్వేస్టేషన్లో చోటు చేసుకున్న అతి చిన్న నోటి మాటతో జరిగిందంటే మీరు నమ్ముతారా.. తొక్కిసలాటలో జరిగిన ప్రమాదంలో 23 మంది అమాయక ప్రాణాలు పోవటం అంటే మాములు విషయం కాదు.

ఈ సంఘటన ఎలా జరిగిందో.. ఒక బాధితురాలి చెప్పిన మాట వింటే అందరూ అవాక్కు అవ్వాల్సిందే. మాటలో వచ్చిన చిన్న తేడా.. దాన్ని అర్థం చేసుకోవటంలో దొర్లిన పొరపాటుకు 23 నిండుప్రాణాలు బలి అయ్యాయంటే మనసు గాయమౌతుంది. పువ్వులు (ఫూల్) పడిపోయాయి అన్న మాటను పూల్ (వంతెన) పడిపోయిందని అక్కడి వారు అర్థం చేసుకోవటంతో ఏర్పడిన గందరగోళంతో ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తుంది. ఈ ఉదంతంలో ప్రాణాలతో బయటపడిన ఓ యువతి ఈవిషయాన్ని వెల్లడించారు.

బ్రిడ్జి పక్కనే ఉన్న పూలు అమ్ముకునే వ్యక్తి పూలు పడిపోయాయి (ఫూల్ గిర్ గయా) అంటూ ఏడుస్తూ చెప్పిన మాటను.. అక్కడి వారు తప్పుగా పూల్ (వంతెన) గిర్ గయా అని అర్థం చేసుకోవటంతో.. ప్రాణాలు దక్కించుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. ఒక్క మాటలో దొర్లిన చిన్నపాటి తప్పు ఏకంగా 23మంది ప్రాణాలు పోయేలా చేసిందంటే టంగ్ స్లిప్ అవ్వడం ఎంత ప్రమాదమో తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో విద్యార్థిని కూడా ఇదే విషయాన్ని చెప్పడం చూస్తుంటే నోటి నుంచి వచ్చే మాట కొన్ని సందర్భాలలో ఎలాంటి పెను ప్రమాదాలను తెస్తుందో అర్ధమవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -