Sunday, May 19, 2024
- Advertisement -

కోదండ‌రామ్‌కి చుర‌క‌లంటించిన సీఎం…

- Advertisement -

తెలంగాణా సీఎం కేసీఆర్ …ఫ్రోఫెస‌ర్ కోదండ‌రామ్‌పై విరుచుకు ప‌డ్డారు. ఎప్పుడూ కూడా డైరెక్ట్‌గా విమ‌ర్శించ‌ని కేసీఆర్ ఈసారి శివాలెత్తారు. సింగరేణి ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు ఒక్కటైనా టిబిజికేఎస్ విజయం సాధించిందన్న ఆయ‌న కోదండ‌రామ్‌ను ఏకేశారు.

కోదండరాం జీవితంలో సర్పంచ్ కాలేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. ఆయన తనను తాను ఎక్కువగా ఊహించుకున్నారని మండిపడ్డారు. కోదండరాం అనే వాడు టిఆర్ఎస్ వ్యతిరేకి అన్నారు. టిబిజికెఎస్‌కు ఓటేస్తే ఫలితం ఉండదని అంటారా అని నిలదీశారు.

గ‌త ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్‌తో క‌లిసి టీజేఏసీ ఛైర్మ‌న్‌ ప్రొ.కోదండ‌రామ్ కాంగ్రెస్‌కు మేనిఫెస్టో రాశార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. అయినా ఆ పార్టీ ఏమైందో అంద‌రికీ తెలుస‌ని చెప్పారు. చిరంజీవి పార్టీ పెడితే ప్ర‌జ‌లు ఆ పార్టీని క‌ట్టెల మోపును కింద ప‌డేసిన‌ట్లు ప‌డేశారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. వ్య‌క్తులు ఎవ‌రికి వారు పార్టీలు పెట్టుకుంటే అవి న‌డ‌వ‌బోవ‌ని జోస్యం చెప్పారు. ఎన్టీఆర్ మూడుత‌రాల న‌టుడని, తెలుగు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో స‌రైన స‌మ‌యంలో పార్టీ పెట్టారని గొప్ప‌వార‌య్యార‌ని చెప్పారు. ఎన్టీఆర్ కి ప్రజల్లో విశ్వసనీయత ఉందని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -