Tuesday, May 7, 2024
- Advertisement -

అనుష్కను ఆ విషయంలో బాగా ఏడిపించిన నాగార్జున..

- Advertisement -

టాలీవుడ్ లోకి అనుష్క పరిచయం అవ్వడానికి ముఖ్య కారణం నాగార్జున. నాగ్ చేసిన సూపర్ సినిమాతోనే అనుష్క హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ తర్వాత అనుష్క.. నాగ్ తో చాలా చిత్రాలల్లోనే రొమాన్స్ చేసింది. వీరిద్దరు చేసిన రొమాన్స్ ప్రతి సినిమాలో అద్భుతంగా వర్కవట్ కావడం.. అనుష్క,నాగార్జున మధ్య సామ్ థింగ్ సామ్ థింగ్ ఎదో ఉంది అని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపించాయి.

ఇప్పటికి కూడా ఆ గాసిప్స్ నడుస్తూనే ఉన్నాయి. ఆ రూమర్స్ అన్ని పక్కన పెట్టి అనుష్క తన కెరీర్ ను బిల్డ్ అప్ చేసుకొనే పనిలో పడింది. గోపీచంద్ సరసన నటించి అతనికి గొప్ప హిట్ ని అందించింది తరువాత అరుందతి సినిమాలో జేజమ్మ పాత్ర చేసి.. తెలుగు ప్రేక్షకులను ఒక రేంజ్ లో మైమరపించింది. టాలీవుడ్ జేజమ్మ క్యారెక్టర్ తో అనుష్క ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది. తర్వాత ఆఫర్స్ వచ్చిన పెద్ద సక్సెస్ రాలేదు. తాజాగా బాహుబలి సినిమాతో మళ్ళి దేనసేన క్యారెక్టర్ తో ఒక హైప్ కి వెళ్ళిపోయింది పార్ట్ 1 లో తనకి అంత రొమాంటిక్ సిన్స్ లేకపోయినా పార్ట్ 2 లో మాత్రం రెబల్ స్టార్ తో కలిసి కెమిస్ట్రీ పండించి చిందులు వేసింది.

రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో నాగార్జున అనుష్క ని ఇన్వైట్ చేశారు. ఆ ఇంటర్వ్యూ లో నాగ్.. అనుష్క గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. అనుష్క అంటే నాకు చాలా ఇష్టమని.. తనతో చేసిన సినిమాలు అన్ని మంచి హిట్ సాధించాయని అన్నారు. తనతో షూటింగ్ లో పాల్గొన్నప్పుడల్లా తనని ఏడిపిస్తూ ఉంటాను అని చెప్పుకొచ్చాడు. తను ఎప్పుడు సెట్ లో ఎదో ఆలోచిస్తూ ఉంటుంది అందుకే నేను తనపైన జోక్స్ వేసి ఎడిపిస్తూ ఉంటాను అని చెప్పాడు నాగార్జున. ఇది అసలు విషయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -