Wednesday, May 8, 2024
- Advertisement -

బాబుతో చ‌ర్చ‌లు స‌ఫ‌లం… టీడీపీలో చేరేందుకు మాజీ మంత్రి డేట్‌ ఫిక్స్‌..

- Advertisement -

మొద‌టి నుంచి వై.ఎస్. కుటుంబానికి క‌డ‌ప‌జిల్లా కంచుకోట‌. ఆ కంచుకోట‌ను బ‌ద్ద‌లు కొట్టేందుకు బాబు వేసిన మాస్ట‌ర్ ప్లాన్ విజ‌య‌వంతం అయ్యింద‌నె సంకేతాలు వినిపిస్తున్నాయి. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి జ‌గ‌న్‌ను ఏకాకిని చేయాల‌ని బాబు పావులు క‌దుపుతున్నారు.

నామినేటెడ్ పోష్ట్‌ల భ‌ర్తీతో జ‌గ‌న్‌కు చెక్ పెట్టేప‌నిలో బాబు బిజీగా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ మాజీమంత్రి సీనియ‌ర్‌నేత డీఎల్ ర‌వీంద్దారెడ్డిని టీడీపీలోకి చేర్చుకొనేందుకు రంగం సిద్ధ‌మ‌య్యింది. ఇప్ప‌టి వ‌ర‌కు కడప జిల్లా టిడిపి మైదుకూరు ఇంచార్జీగా సుధాకర్‌యాదవ్ కొనసాగుతున్నారు. ఇందులో భాగంగానే సుధాకర్‌యాదవ్‌కు టిటిడి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టనున్నారని ప్రచారం సాగుతోంది.

టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వీ కాలం ముగిసి ఆరు నెల‌లు అవుతున్నా ఇప్ప‌టి వ‌ర‌కు ఛైర్మెన్‌ను నియ‌మించ‌లేదు. మొద‌ట ప‌ద‌విని హరికృష్ణకు ఇవ్వాలని భావించినా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇవ్వ‌లేదు. మ‌రో వైపు నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్‌రావు పేరు తెరమీదికి వచ్చింది. టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌విపై తీవ్ర‌పోటీ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే.

రాజకీయ కారణాల నేపథ్యంలో సుధాకర్‌యాదవ్‌ పేరును టిటిడి ఛైర్మెన్ పదవి కోసం ప్రతిపాదించాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారని సమాచారం. సుధాకర్‌యాదవ్‌ను టిటిడి ఛైర్మెన్‌గా నియమిస్తే కడప జిల్లాల్లో రాజకీయ సమీకరణాలను మార్చే దిశగా చంద్రబాబు వ్యూహం రచిస్తున్నారు.

అయితే కడప జిల్లాలో చోటుచేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరాలని నిర్ణయించుకొన్నారనే ప్రచారం సాగుతోంది. 10 రోజుల క్రితం డిఎల్ రవీంద్రారెడ్డి ఏపీ సిఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యారు. డిఎల్ రవీంద్రారెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నారని సమాచారం.

తనకు ఎమ్మెల్యే సీటిస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరుతారని టీడీపీకి ఆఫర్ ఇచ్చారు. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, నియోజకవర్గంలో మంచి పట్టున్న లీడర్ కావడంతో చంద్రబాబు కూడా వెంటనే పచ్చజెండా ఊపేశారట చంద్ర‌బాబు. దీంతో క‌డ‌ప జిల్లాలో వైసీపీ బ‌ల‌ప‌డ‌కుండా జ‌గ‌న్‌ను క‌ట్ట‌డి చేసేందుకు బాబు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -