Tuesday, May 7, 2024
- Advertisement -

రవి అంటే పిచ్చి.. అవును ఇద్దరం డేటింగ్ లో ఉన్నాం.. : రవి, శ్రీముఖి

- Advertisement -

ప్రస్తుతం యాంకర్స్ కి తెలుగులో మంచి డిమాండ్ ఉంది.. ప్రస్తుతం యాంకరింగ్ లో సుమ టాప్ లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అనసూయ, రష్మీ, లాస్య, శ్రీముఖి.. ఇలా వస్తునే ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం శ్రీముఖి బాగా ఫాపులర్ అయిన విషయం తెలిసిందే. ఆమెకి తినడానికి కూడా టైం లేనంత బిజీగా శ్రీముఖీ ఉంది. బుల్లితెరపై చాలా షోలే చేస్తున్న ఈమెకి పటాస్ ద్వారా బాగా పేరు వచ్చింది.

ఇక మేల్ యాంకర్స్ లో ప్రస్తుతం ప్రదీప్, రవిలకి మంచి డిమాండ్ ఉంది. రవి కూడా ఎప్పటి నుంచో యాంకరింగ్ చేస్తున్నా.. శ్రీముఖితో ఆయన పటాస్ అనే షో ద్వారా బాగా ఫాపులర్ అయ్యాడు. వీరిద్దరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కవట్ అయింది. అయితే రవి అప్పట్లో లాస్యతో కలిసి యాంకరింగ్ చేసేవాడు. ఆ టైంలోనే అతడు ఆమెని లవ్ చేసినట్లు.. అందుకు లాస్య ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య గొడవలు రావడం.. అ తర్వాత వారిద్దరు వీడిపోయి.. ఎవరికి వారు యాంకరింగ్ చేసుకోవడం జరిగింది. అయితే వీరిద్దరు ఎందుకు విడిపోయారు అనే విషయంపై అప్పట్లో తెగ వార్తలు వచ్చాయి. ఏది ఏమైన లాస్యతో యాంకరింగ్ తప్ప మరేలాంటి లింక్ లేదని రవి చాలా సార్లు చెప్పేశాడు. ఆ తర్వాత రవి, శ్రీముఖి ప్రేమలో పడ్డట్టు వార్తలు వచ్చాయి.. వాటిపై వారు స్పందించిన అవి కేవలం రూమర్స్ అనే కొన్ని సార్లు కొట్టిపారేశారు. అయితే తాజాగా ఓ ప్రముఖ టీవీలో ఆలీతో సరదాగా అనే కార్యక్రమంలో యాంకర్ రవి, లాస్య పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంకు సంబంధించిన ఒక ప్రోమోని ఇటివలే రిలీజ్ చేశారు. అందులో ఆలీ కొన్ని ప్రశ్నలు వీరిద్దరిని అడిగాడు.. రవి అంటే ఏంటి అన్న ప్రశ్నకు శ్రీముఖి.. రవి అంటే పిచ్చి అని సమాధానం ఇచ్చింది. ఎందుకంటే తనకు చిల్లర అబ్బాయిలంటే ఇష్టమని తెలిపింది. ఇక మీరిద్దరు డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని రూమర్స్ వచ్చాయి దాని గురించి ఏమంటారని ఆలీ అడగటంతో.. అవును డేటింగ్ లో ఉన్నాం.. రెండు సంవత్వరాల నుంచి కలిసి యాంకరింగ్ చేస్తున్నాం.. బయట కూడా కలుసుకుంటాం.. అందులో తప్పు ఏం ఉందని ఆమె తెలిపింది. మరి ఇంకెన్ని విషయాలు ఈ కార్యక్రమంలో వీరు తెలిపారో తెలియాలంటే ఫుల్ వీడియో వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -