Sunday, May 19, 2024
- Advertisement -

రెండు పడవల మీద కాళ్లు పెట్టి ప్రయాణం చేస్తున్న వాళ్ల పార్టీకి అవ‌స‌ర‌మా…?

- Advertisement -

ప్ర‌స్తుతం వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క్లిష్ట ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. పార్టీలో ఎవ‌రు ఉంటారో…ఎవ‌రు జంప్ అవుతారొ అంతా గంద‌ర‌గోలంగా ఉంది. ముంద‌స్తు ఎన్నిక‌ల సంకేతాలు వినిపిస్తుండ‌టంతో త‌న‌తో ఎవ‌రు ఉంటారో ఎవ‌రు పార్టీని వీడ‌తారో తెలుసుకొనె పనిలో ఉన్నారు జ‌గ‌న్‌. పాద‌యాత్ర మొద‌లు పెట్టేలోపు జింప్ జిలానీల తేల్చే ప‌నిలో ప‌డ్డారు.

తాజాగా ఆపార్టీకి చెందిన క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుక.. తమను వీడి తెలుగుదేశం పార్టీలో చేరడానికి తనే స్వయంగా మార్గం సుగమం చేయడం ద్వారా మంచి పనే చేశార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. రెండు ప‌డ‌వ‌ల మీద కాల్లు పెట్టి ప్ర‌యాణం చేసెవాల్ల వ‌ల్ల పార్టీకి పెద్ద న‌ష్టం అన‌డంలో సందేహంలేదు. గోడ‌మీద పిల్లుల్లాగా ఎప్పుడు సందు దొరికితె అటు వైపు జంపేయ్యేవాల్ల భ‌విష్య‌త్తులో స‌మ‌స్య‌లు రాకుండా ఉండేందుకు జ‌గ‌న్ సిద్ద‌మ‌వుతున్నారు.

ఇలాంటి వాల్ల‌ను వారిని వదిలించుకోవడం పార్టీకి చాలా మంచిది. ఒక్క బుట్టా రేణుక మాత్రమే కాదు, వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్లాలనే ఆలోచన మనసులో దోబూచులాడుతుండగా.. అటు నిర్ణయం తీసుకోకుండా, ఇటు వైసీపీకి కూడా మనస్పూర్తిగా పనిచేయకుండా మీమాంసలో ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి వెల్తె అంతో ఇంతో లాభం ఉటుంది..కాని వైసీపీతో పెనవేసుకున్న బంధం ఆపుతూ ఉంటుంది.

వైసీపీ నుంచి వెళ్లదలచుకున్న వారు ఎందరు వెళ్లిపోయినా సరే.. పార్టీకి కొత్త నాయకుల్ని తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. జగన్ పాదయాత్ర సమయానికి కొత్త నాయత్వం అంది వచ్చిందంటే.. వారికి కూడా ప్రజల్లో గుర్తింపు వచ్చేస్తుంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ఉంది కాట్టి కొత్త‌నాయ‌కుల‌ను కాగ‌వారిని గుర్తిస్తె అప్ప‌టికి వారు సిద్ద‌మ‌వుతారు. పార్టీకి భారంగా మారుతున్న డోలాయమానం నాయకులు అందరినీ వదిలించుకోవడమే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

బుట్టా రేణుక సంగతి అధికారికంగా కన్ఫర్మ్ అయినట్లే. నేడో రేపో అధికారిక ప్రకటన ఒక్కటే తరువాయి.జ‌గ‌న్ అనంత‌పురంలో నిర్వ‌హించిన యువ‌భేరి కార్య‌క్ర‌మానికి గుర్నాధ్‌రెడ్డి డుమ్మాకొట్టి అదే సంకేతాలు ఇచ్చేశారు. అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ఇలాంటి వారిని పార్టీనుంచి వ‌దిలించుకుంటె మంచిద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -