Monday, May 6, 2024
- Advertisement -

చంద్రబాబుపై మరో బాంబు..ఈ సీట్లు జనసేనకు కేటాయించాల్సిందే!

- Advertisement -

టీడీపీ – జనసేన పొత్తు కుదిరినప్పటి నుండి తనదైన శైలీలో విశ్లేషణ చేస్తున్నారు మాజీ ఎంపీ హరిరామజోగయ్య. ప్రధానంగా జనసేనకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని మొదటి నుండి డిమాండ్ చేస్తున్న ఈ మాజీ ఎంపీ…ఇందుకోసం పవన్‌పై నాయకుల నుండి ఒత్తిడి తెచ్చేలా లేఖాస్త్రాలు సంధిస్తున్నారు.

ఇప్పటికే పలుమార్లు చంద్రబాబును టార్గెట్ చేస్తూ పవన్‌కు సపోర్టుగా లేఖలు వదలగా తాజాగా మరో బాంబు పేల్చారు. టీడీపీ -జనసేన మధ్య పొత్తులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సీట్లు జనసేనకు ఇస్తారనేది పక్కన పెడితే ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజాభీష్టం మేరకు ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పవన్ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నందున ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలన్నారు. జనసేనకు ఎక్కువ సీట్లు ఇస్తేనే టీడీపీకి గెలిచే అవకాశాలుంటాయని చెప్పుకొచ్చారు. జనసేన బలంగా ఉన్న చోట్ల టీడీపీ పొరపాటున పోటీ చేస్తే ఓడిపోతుందని బాంబు పేల్చారు. ఇందులో భాగంగా కొన్ని స్థానాలను సైతం సూచించారు జోగయ్య.

నరసాపురం ఎంపీ స్థానంతో పాటు నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం,తణుకు, నిడదవోలు, ఉంగుటూరు,ఏలూరు,పోలవరం,గోపాలపురం,కొవ్వూరు,ఉండి అసెంబ్లీ స్థానాలను జనసేనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సీట్లలో జనసేన పోటీ చేయకపోతే జరిగే పర్యావసానం వల్ల వచ్చే నష్టాన్ని టీడీపీ నేతలు అనుభవించాల్సి ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. అసలే పొత్తులో భాగంగా ఎన్ని సీట్లలో జనసేన పోటీ చేస్తుందోనన్న సందేహం అందరిలో నెలకొనగా హరిరామజోగయ్య పేలుస్తున్న బాంబుతో టీడీపీ డిఫెన్స్‌లో పడే పరిస్థితి నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -