- Advertisement -

‘డీజే’ మూవీలో అల్లు అర్జున్ ఏం చేస్తాడంటే..?

- Advertisement -
Allu Arjun As Caterer in DJ Movie

అల్లు అర్జున్ అభిమానులే కాక మెగా ఫ్యాన్స్ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘దువ్వాడ జగన్నాథం’ ఫస్ట్ లుక్ బయటికి వచ్చేసింది. ఈ ఫస్ట్ లుక్ అభిమానుల అంచనాల్ని బాగానే అందుకుంది. అల్లు అర్జున్ బ్రాహ్మణ కుర్రాడిగా కొత్త అవతారం జనాల్ని బానే ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూశాక మూవీ ఎలా ఉంటుందో అందరికీ ఒక అంచనా వచ్చేసింది.

ముఖ్యంగా ఈ పోస్టర్లో చాలా ప్రత్యేక విషయాలు కనిపించాయి. పాత బజాజ్ స్కూటర్ మీద హీరో వెళ్తుండటాన్ని బట్టి ఇది కొన్నేళ్ల వెనకటి నేపథ్యంలో సాగే కథ అని అర్థమైంది. కూరగాయలు భారీ స్థాయిలో బండి మీద పెట్టుకుని తీసుకెళ్తున్నాడు కాబట్టి.. హీరో పాత్ర ఏమై ఉంటుందో కూడా ఒక అంచనాకు వచ్చేశారు జనాలు. మరింత క్లారిటీ కోసం స్కూటర్ మీద ఒక వైపు ‘అన్నపూర్ణ కేటరింగ్సు.. ప్యూర్ వెజిటేరియన్సు’ అని రాసి ఉన్న ఒక లోగోను గమనించవచ్చు. అంటే హీరో కుటుంబం కేటరింగ్ బిజినెస్ చేస్తుందన్నమాట.

కాబట్టి ‘అదుర్స్’ తరహాలో పౌరోహిత్యం లాంటిదేమీ ఉండకపోవచ్చు. హీరో బ్రాహ్మణుడు.. అతడి ఫ్యామిలీ కేటరింగ్ చేస్తుంది అనగానే కమల్ హాసన్ సినిమా ‘మైకేల్ మదన కామరాజు’ గుర్తుకు రాకమానదు. అందులోనూ హీరో అండ్ ఫ్యామిలీ బిజినెస్ అదే. ‘అదుర్స్’ సినిమాలో చారి పాత్రకు సంబంధించి హరీష్ శంకర్ హ్యాండ్ ఉంది. ఆ మూవీలో ఆ ట్రాక్ ఎంతగా వినోదం పండించిందో తెలిసిందే. ‘దువ్వాడ జగన్నాథం’ కూడా అదే తరహాలో వినోదం పండిస్తుందో లేదో చూడాలి.

{youtube}v=ldGXo7sBc-4{/youtube}

Related

  1. అల్లు అర్జున్ డీజే పోస్టర్ లో పవన్ కళ్యాణ్
  2. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్
  3. అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!
  4. పవన్ కళ్యాణ్ ని అల్లు అర్జున్ పట్టించుకోలేదా? కారణం ఇదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -