- Advertisement -

అల్లు అర్జున్ డీజే పోస్టర్ లో పవన్ కళ్యాణ్

- Advertisement -
two highlights in first look of allu arjuns dj duvvada jagannadham

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా డీజే (దువ్వాడ జగన్నాధం). భారీ అంచనాలతో ఈ సినిమా తెరకెక్కుతుంది.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు తమ బ్యానర్లో 25 వ సినిమాగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ నేడు విడుదల అయ్యింది. చేతక్ స్కూటీ పైన కూరగాయలను పెట్టుకుని నడిపిస్తున్న అయ్యవారి గెటప్ లో అల్లు అర్జున్ లుక్ సూపర్ గా ఉంది.

అల్లు అర్జున్ ఈ లుక్ లో చాలా బాగున్నాడని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ పోస్టర్ లో రెండు అంశాల గురించి నెటిజనులు ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఒకటి స్కూటీ నంబర్ 2425. హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ బైక్ కి ఈ నంబర్ ఉంటుంది. సో ఆ సినిమా హిట్ సెంటిమెంట్ ని ఈ సినిమాలో డైరక్టర్ కొనసాగిస్తున్నారు.

మరో విషయం ఏంటంటే.. “అన్నపూర్ణ కేటరింగ్సు, ప్యూర్ వెజిటేరియన్సు” .. అనే స్టిక్కర్. పోస్టర్ లో కూడా డైలాగ్ పేల్చి హాస్యం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పారు. ఇక ఈ స్టిక్కర్ లో విజయవాడ అని రాసి ఉంది. అంటే సినిమా కథ ఎక్కువ భాగం విజయవాడలో సాగుతుందని అర్ధం చేసుకుంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

{youtube}v=8tChvIzPmsA{/youtube}

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  2. అల్లు అర్జున్ కి తలనొప్పిగా మారిన ప్రభాస్!
  3. చిన్నారి ప్రాణాలు కాపాడిన హీరో అల్లు అర్జున్!
  4. అల్లు అర్జున్ డీజే లుక్ సూపర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -