Sunday, May 5, 2024
- Advertisement -

షాకింగ్ః నా పేరు సూర్య….. అవుట్‌పుట్‌పై అల్లు అర్జున్ అసంతృప్తి…. డైరెక్టర్‌కి క్లాస్

- Advertisement -

నా పేరు సూర్య……..నా ఇల్లు ఇండియా అనే టైటిల్‌తోనే బన్నీ సినిమాకు ఫుల్ పాజిటివ్ బజ్ వచ్చేసింది. ఆ తర్వాత యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ ఇంపాక్ట్ కూడా ప్రశంశలు దక్కించుకుంది. మరీ ముఖ్యంగా బన్నీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా షూటింగ్ మొత్తం అయిపోవచ్చిన నేపథ్యంలో ఇఫ్పుడు ఈ సినిమాపై షాకింగ్ రూమర్స్ బయటికి వచ్చాయి. సినిమా అవుట్ పుట్‌పై కాస్త డిసప్పాయింట్ అయిన బన్నీ డైరెక్టర్ వంశీకి క్లాస్ పీకాడట.

సినిమా మొత్తం రష్ చూసిన బన్నీ అండ్ టీంకి అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా నచ్చిందట. తెలుగు స్టార్ హీరోస్‌లో కెల్లా అల్లు అర్జున్ బెస్ట్ పెర్ఫార్మర్ అని పేరు వచ్చేంత స్థాయిలో బన్నీ నటన ఉందట. అయితే వక్కంతం వంశీ కథనం మాత్రం అక్కడక్కడా ల్యాగ్ అయ్యేలా కనిపించదట బన్నీకి. అసలే కాస్త సీరియస్ ఎమోషన్స్ ఉన్న కథ కావడంతో అస్సలు ల్యాగ్ లేకుండా చూడమని వంశీకి చెప్పాడట బన్నీ. మరీ ముఖ్యంగా హృతిక్ రోషన్ నటించిన లక్ష్య సినిమా స్టైల్‌లో టైట్ స్క్రీన్ ప్లే ఉండేలా ప్లాన్ చేయమన్నాడట. రేసీ కథనంతో సినిమా సూపర్ ఫాస్ట్‌గా సాగిపోయేలా ఉండాలని చెప్పాడట. ఈ మధ్య కాలంలో వరుసగా ఊరమాస్ కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన బన్నీ……..ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. తన క్యారెక్టర్‌కి, తన పెర్ఫార్మెన్స్‌కి మంచి పేరు వచ్చేలా చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ‘నా పేరు సూర్య…….నా ఇల్లు ఇండియా’ సినిమాను అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు అల్లు అర్జున్. అందుకే ఏడు భాషల్లో డబ్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఏది ఏమైనా సినిమా కోసం అల్లు అర్జున్ పడుతున్న తపనను మాత్రం అభినందించాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -