Monday, April 29, 2024
- Advertisement -

ఆ రూ.100 ఇప్పటికి దాచుకున్న బన్నీ!

- Advertisement -

మెగా ఫ్యామిలీ మార్క్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే సూత్రాన్ని ఇమిడించుకున్న బన్నీ..తన నడవడికలోనూ దానిని చూపిస్తారు.

పుష్పతో జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సొంతం చేసుకున్న బన్నీకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దర్శకుడిగా ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. బన్నీ సైతం రాఘవేంద్రరావు తెరకెక్కించిన గంగొత్రి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

బన్నీ డాన్స్,యాక్టింగ్ చూసి ముగ్ధుడైన నా సినిమాలో నువ్వే హీరో అని వెంటనే అడ్వాన్స్ కింద ఓ 100 ఇచ్చాడట రాఘవేంద్రరావు. ఆ వందను బన్నీ ఇప్పటికీ అపూరుపంగా దాచుకన్నాడట. ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని వెల్లడించారు రాఘవేంద్రరావు. ఇటీవల బన్నీ వాళ్ల అమ్మ నాకు ఆ విషయం గుర్తు చేశారు. బన్నీ ఆ 100 రూపాయలు అలాగే దాచుకున్నాడని చెప్పారని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -