- Advertisement -

షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై పెద్దిరెడ్డి

- Advertisement -

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో వైఎస్ షర్మిల హస్తం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. తన పార్టీ వైఎస్‌ఆర్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయగా ఇకపై పార్టీ బలోపేతం కోసమే పనిచేస్తానని చెప్పుకొచ్చారు. ఇక షర్మిల కాంగ్రెస్‌లో చేరికపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి. జగన్‌కు వ్యతిరేకంగా పనిచేసే వారిని తాము ప్రతిపక్షంగానే చూస్తామని ఇందులో షర్మిల కూడా మినహాయింపు కాదన్నారు.

సీఎం జగన్‌కు షర్మిల చెల్లి అయినంత మాత్రానా ఆమె ఏం చేసినా ఉపేక్షించే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజకీయంగా తమ కాళ్లు తామే నరుక్కుంటామా? అని అడిగారు. తాము పద్ధతిగా రాజకీయాలు చేస్తున్నామని, ఇకపైనా అలాగే ఉంటామని చెప్పారు. మంచైనా, చెడైనా తాము జగన్ వెంటే ఉంటామని…మళ్లీ జగన్‌ను సీఎం చేస్తామని చెప్పారు.

ఇక కాకినాడలో జగన్ చేసిన కామెంట్స్ ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కుటుంబాలను చీల్చుతారని, రాజకీయాలు చేస్తారని ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు జగన్. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేది సోనియాగాంధీ, చంద్రబాబు అని ఫైర్ అయ్యారు పెద్దిరెడ్డి. వారిద్దరు కలిసే ఆనాడు జగన్‌ను జైలుకు పంపారని ఆరోపించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -